వైయ‌స్ జగన్ కోసం సైనికుల్లా పనిచేద్దాం

 దేశంలో లక్ష కోట్లతో 31 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఏకైక సీఎం వైయ‌స్‌ జగన్

 చంద్రబాబు ఎల్లో మీడియాపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నాడు

  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

అనంత‌పురం: రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ మనల్ని నమ్ముకున్న సీఎం వైయ‌స్‌ జగనన్న కోసం ప్రతి వైయ‌స్ఆర్‌సీపీ  నాయకుడు, కార్యకర్త యుద్ధ సైనికుల్లా పని చేయాలని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ప్లీనరీ సభ అనంతపురంలోని శిల్పారామం జరిగింది. దీనికి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి అతిథిగా హాజరయ్యారు. నవరత్నాలు-పేదలందరికి ఇళ్ళు అంశంపై మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రసంగించారు. ఒక రాష్ట్రంలో రూ లక్ష కోట్ల రూపాయలతో 31 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం దేశ చరిత్రలోనే ఒక రికార్డని అది సీఎం జగన్ ఒక్కడికే సాధ్యమైందన్నారు. అనంతపురం జిల్లాలో రూ.120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొదటి విడతలో 67 వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. అంతే కాక భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పన తదితర వాటికోసం 215 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు.తాను గడప గడపకు వెళ్లిన సమయంలో ప్రజల నుంచి జగన్ పాలనపై 100 శాతం సంతృప్తి వస్తోందన్నారు. ఒకవైపు రాష్ట్రం ఇలా అభివృద్ధి పథంలో సాగుతుంటే మరోవైపు 40 ఏళ్ళు రాజకీయాలు అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ఎల్లో మీడియాపై ఆధార పడి రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయ జీవితం అని ఎద్దేవాచేశారు. చంద్రబాబు పని అయిపోయిందని ఆయనకు  ఇవే ఆఖరి ఎన్నికలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు అన్ని గెలిపించి జగనన్న కు కానుకగా ఇద్దామని విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు.
 

Back to Top