వైయ‌స్ఆర్‌సీపీ నేత చెవిరెడ్డి ఎయిమ్స్‌కు త‌ర‌లింపు

విజయవాడ: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం విజయవాడ నుంచి మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నరాల సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న చెవిరెడ్డి అభ్యర్థన మేరకు పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని వైద్య సహాయం అందించేందుకు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న‌ చెవిరెడ్డి గ‌త కొంత కాలంగా ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. ఎయిమ్స్‌లో న్యూరాలజీ విభాగానికి చెందిన నిపుణ వైద్యులు ఆయనకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసిన చెవిరెడ్డి నేడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా ధైర్యంగా నిలబడుతున్నారని తెలిపారు. రాజకీయ జీవితంలో అనేక ఒత్తిడులు ఎదుర్కొన్నా, ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగిన నాయకుడిగా ఆయనకు ప్రజల్లో విశేష గౌరవం ఉందని పేర్కొన్నారు. అన్యాయాలపై నిలబడే ప్రతి సందర్భంలో చెవిరెడ్డి ముందుంటారని, ప్రజల సమస్యల కోసం తన ఆరోగ్యాన్నే లెక్కచేయకుండా పనిచేశారని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. 

Back to Top