సీఎం చంద్రబాబుది మోసపూరిత పాలన

వైయ‌స్ఆర్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా: సీఎం చంద్రబాబుది మోసపురిత పరిపాలన అని వైయ‌స్ఆర్‌సీపీ కళ్యాణదుర్గం నియోజ‌క‌వ‌ర్గ‌ సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు.  బ్రహ్మాసముద్రం మండలంలోని పోబ్బర్లపల్లి గ్రామంలో  బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రీ కాలింగ్ చంద్ర‌బాబు మ్యానిఫెస్టో..పేరుతో ఇంటింటా ప‌ర్య‌టించి కూట‌మి పాల‌న‌లో ప్ర‌జ‌లు ఎలా న‌ష్ట‌పోయారో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి వివ‌రించారు.  ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడులు చేసి తిరిగి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.  కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ చంద్రశేఖర్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు గంగాధరప్ప, గోపాల్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top