మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు పితృవియోగం

వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి: మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ మంగ‌ళ‌శారం మృతి చెందారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ  కన్నుమూశారు. స‌త్య‌నారాయ‌ణ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు త‌న ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైయ‌స్ జ‌గ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

Back to Top