శ్రీవారి మెట్టు మార్గంలో పోలీసులు ఓవరాక్షన్

తిరుమల శ్రీవారి దర్శనంకు కాలినడక మార్గంలో వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు,కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు 

తిరుప‌తి: ఎంపీ మిథున్ రెడ్డి ఆరోగ్యం కుదుట పడాలని, శ్రీవారి ఆశీస్సులు తో బెయిల్ మంజూరు కావాలని పాదయాత్రగా  50 మందితో వెళ్లేందుకు శ్రీవారి మెట్టు మార్గం కు చేరుకున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. టిటిడి అధికారులు అనుమతి ఇస్తేనే పంపిస్తామని పోలీసులు వితండ వాదం పెట్టుకుని ఓవ‌రాక్ష‌న్ చేశారు.  పోలీసులు తీరుపై హరిప్రసాద్ రెడ్డి, సత్యవేడు వైయ‌స్ఆర్‌సీపీ రాజేశ్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలిపారు. కార్య‌క్ర‌మంలో  వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రీజనల్ కో-ఆర్డినేటర్ హేమంత్ రెడ్డి , విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చక్రధర్ , జిల్లా యువత అధ్యక్షులు శివ ప్రసాద్ , ఉపాధ్యక్షులు ద్వారకనాథ్ రెడ్డి భువనేశ్వర్ రెడ్డి ,లోకనాథ రెడ్డి , వినోద్ కుమార్, మలతోట నరేష్  చైతన్య రెడ్డి, జీవన్ రెడ్డి, సాయి, రవి, జగదీశ్, రెడ్డి, భారత్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top