జూన్‌ 3న వైయ‌స్ఆర్‌సీపీ ఐటీ విభాగ స‌ద‌స్సు

 అమ‌రావ‌తి: వైయ‌స్ఆర్‌సీపీ ఐటీ విభాగం జూన్ 3వ తేదీ హైద‌రాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, ప్రొఫెష‌న‌ల్స్‌తో ఒక భారీ స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది. హైటెక్ సిటీలోని బుట్టా క‌న్వెన్ష‌న్ హాలులో ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ స‌ద‌స్సు ప్రారంభ‌మ‌వుతుంది. ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 

ఈ స‌మావేశానికి హైద‌రాబాద్‌ నగరంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగుల‌ను పెద్ద సంఖ్య‌లో ఆహ్వానిస్తున్నారు. వైస్సార్‌సీపీ ఐటీ విభాగం అధ్య‌క్షులు సునీల్ కుమార్ రెడ్డి పోసింరెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ సద‌స్సు జ‌రుగుతుంది. ఈ స‌ద‌స్సులో వైస్సార్‌సీపీ పార్టీ బ‌లోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి, ఐటీ ఉద్యోగుల స‌మ‌స్య‌లపైన సమగ్రంగా చ‌ర్చిస్తారు. ఈ స‌ద‌స్సుకు వైస్సార్‌సీపీని అభిమానించే ఐటీ ఉద్యోగులంద‌రూ తప్పకుండా హాజరై సదస్సును విజయవంతం చేయాలని సునీల్ కుమార్ రెడ్డి కోరారు. స‌ద‌స్సుకు హాజ‌రు కాద‌ల‌చిన‌వారు ముందుగా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌న్నారు. వివరాలకు  7829922666, 7032597980 నెంబర్లలో సంప్రదించాలని ఆయ‌న సూచించారు.

Back to Top