స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భంజ‌నం

తాడేప‌ల్లి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించింది.  వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థులు ఘన విజయం సాధించారు. బలం లేకపోయినా పోటీలో నిలిచిన‌ టీడీపీ చ‌తికిల‌బ‌డింది. పశ్చిమ గోదావరి స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థులు క‌వురు శ్రీ‌నివాస్, వంకా రవీంద్రనాథ్‌ గెలుపొందారు. కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. కర్నూలు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ సీపీ విజ‌య ఢంకా మోగించింది. పార్టీ అభ్యర్థి డాక్టర్‌ మధుసూదన్‌రావు ఘ‌న విజ‌యం సాధించారు. అదే విధంగా శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు. వైయ‌స్ఆర్ సీపీకి 636 ఓట్లు రాగా.. ఇండిపెండెంట్ అభ్య‌ర్థికి 108 ఓట్లే మాత్ర‌మే పోల‌య్యాయి. 

 

Back to Top