కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీల ఒత్తిడి ఫలించింది

విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలి

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం సంతోషకర విషయమని, కమిటీ ఎజెండాలో ఏపీ విభజన సమస్యల అంశం చేర్చడం హర్షణీయమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై వైయస్‌ జగన్‌ ప్రభుత్వం, వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల ఒత్తిడి ఫలించిందన్నారు. విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కోరారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినవి ఉన్నాయని, మళ్లీ న్యాయ సమీక్షకు పోకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top