ఇలాంటి వాళ్లా ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించేది..?

వారి క‌ల‌యిక అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన కాలుష్యం లాంటిది

 వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి 

తాడేప‌ల్లి: చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసిపోతార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొద‌టి నుంచి చెబుతుంద‌ని, ముసుగు ఎప్పుడో తొల‌గించి.. ఇప్పుడు లైవ్‌లో ఓపెన్ అయ్యార‌ని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. బాబు, పవన్‌ కలయిక అత్యంత ప్రమాదకరమైన కాలుష్యం లాంటిదన్నారు. విజయవాడలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ కలయిక గురించి మాట్లాడాల్సిన  అవసరం లేదన్నారు. విశాఖ‌ప‌ట్నంలో అసలు ఏం జరిగింది..? 3 గంటలపాటు ఎవరు రోడ్లపై ఊరేగారు..? ఎవరు ఎవరిపై దాడి చేశారు..? ఇక్కడకు వచ్చి ఎవరు చెప్పులు చూపిస్తూ మాట్లాడారో కూడా జనం చూశారన్నారు. వారి అసలు స్వరూపం అదేన‌ని, ఇప్పుడు బయట పెట్టారని, ఇలాంటి వాళ్లా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది..? అని సజ్జల రామ‌కృష్ణారెడ్డి ప్రశ్నించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top