సీఎం వైయ‌స్ జగన్ పై దాడి డ్రామా అని ప్రతిపక్షాలు అనడం సరికాదు 

 మీడియా స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

టిడిపినే డ్రామాలాడుతోంది.నింద తమపైకి వస్తుందని టిడిపి భయపడుతోంది.

దాడి విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒకేరకంగా మాట్లాడుతున్నాయి.

ప్రతిపక్షాలకు పుట్టగతులుండవని అర్ధమైంది.విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

వైయ‌స్‌ జగన్ గారికి  వస్తున్న ప్రజాదరణను చూసి భయపడుతున్నారు.

ఉద్దేశపూర్వకంగా కావాలనే దాడి చేయించుకున్నారని టీడీపీ ప్రచారం చేస్తుంది

డ్రామాలంటున్నవారెవరైనా రాయితో కొట్టించుకోగలరా.

ఎవరైనా తమకు తాము దాడి చేయించుకుంటారా

భద్రతా వైఫల్యం అంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు

దాడి ఘటనలో బాదితులం మేము....సీబీఐ విచారణ వాళ్లు కోరుతున్నారు
 
సింపతీ కోసం  డ్రామాలు ఆడాల్సిన అవసరం సీఎం జగన్ కు  లేదు

ఎన్నికలలో టిడిపి అడ్రస్ గల్లంతవుతుందని భయపడుతున్నారు.

వైయ‌స్  జగన్ గారు డ్రామాలాడేవారైతే గాయం చూపుతూ ప్రచారం చేసుకునేవారు.ఇప్పటివరకు గాయం గురించి మాట్లాడలేదు.

చంద్రబాబు అయితే గాయాలు చూపుతూ ప్రజలనుంచి సింపతీ కోసం ప్రయత్నించేవారు.

 గతంలో అలిపిరి ఇష్యూలో చేతికి కట్టువేసుకుని చంద్రబాబు ప్రజల సానుభూతికోసం విశ్వప్రయత్నం చేశారు. 

తాడేప‌ల్లి:  సీఎం వైయ‌స్ జగన్ పై దాడి డ్రామా అని ప్రతిపక్షాలు అనడం సరికాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సిధ్దం సభ భారీ సభలు...మేమంతా సిధ్దం బస్సుయాత్రతో ప్రజలలో సీఎం వైయ‌స్ జగన్ గారికి ప్రజాదరణ విపరీతంగా వస్తుండటంతో  పుట్టగతులుండవని ప్రతిపక్షాలన్నిటికి భయం పట్టుకుందని అన్నారు. తాడేపల్లిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.

 దాడి విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒకేరకంగా మాట్లాడుతున్నాయన్నారు. నిజానికి  టిడిపినే డ్రామాలాడుతోంది. నింద తమపైకి వస్తుందని టిడిపి భయపడుతోందని వివరించారు. టిడిపి నేతలు దాడి జరిగిన దగ్గర్నుంచి అది చేయించుకున్న దాడే అని ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారన్నారు. ఆ లైన్ కు తగినట్లే భధ్రతా వైఫల్యం అని ఎందుకు సెక్యూరిటీ లేదని ...ఎందుకు కరెంట్ తీశారని...వాళ్ళే చేయించుకున్నారని దర్యాప్తు సిబిఐ ద్వారా చేయించాలని మాట్లాడుతున్నారు.

ఇక్కడ దాడి జరిగిందా లేదా...దాడికి సంబంధించి విచారణలో ఎవరు చేసిందనేది బయటపడాలి. ప్రధానంగా ఇవి రెండే ప్రాధాన్యత కలిగిన విషయాలు. వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా సంబంధంలేని సెక్యూరిటి ఏం చేస్తుంది....కరెంట్ ఎందుకు తీశారు...ఎందుకు అలెర్ట్ చేయలేదు...ఫోకస్ లైట్ ఎందుకు పెట్టలేదు.ఇవన్నీ కూడా సెక్యూరిటి డిపార్ట్ మెంట్ చర్చించుకోవాల్సిన అంశాలు. ప్రస్తుతం ఎన్నికల కమీషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది కాబట్టి ఈసి ఆదేశాలమేరకు విచారణ జరుగుతుంది. దాడి అనేది జగన్ గారిపై జరిగింది. చంద్రబాబుపైనో,పవన్ కల్యాణ్ పైనో జరగలేదు.శాసనసభ్యుడు,మాజి మంత్రి వెల్లంపల్లి సైతం జగన్ గారిపై దాడి సందర్భంగా గాయపడ్డారు. బాధితులు గా ఎవరు దాడికి పాల్పడ్డారో వారిని పట్టుకోవాలి అని అడిగే రైట్ మాకుంటుంది. పోలీసు డిపార్ట్ మెంట్ పై దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఉంటుంది.

 టిడిపికి తాపత్రయం ఎందుకో అర్ధం కావడం లేదు.అంటే నింద వారిపై వస్తుందని భయపడుతున్నట్లుగా ఉన్నారు. నింద మీ మీద ఎందుకు వస్తుందంటే ఇది క్యాజువల్ గా జరిగింది కాదు. దాని వెనుక నేపధ్యం ఉంది కాబట్టి టిడిపిపై అనుమానం వస్తుంది. అదే మేం ఎక్స్ ప్రెస్ చేయడం జరిగింది. టిడిపి డిమాండ్ చేయాలంటే సిబిఐ దర్యాప్తు కోరవచ్చు. విచారణ సత్వరం చేయాలని అడగవచ్చు. కాని అలా కాకుండా ఇది డ్రామా అనటం మరో విధంగా మాట్లాడటం సరికాదు. టిడిపి వాళ్ళు భయపడుతున్నారని క్లియర్ గా జనానికి అర్దం అవుతుంది. జగన్ గారిపై ఆదరణ చూసిన తర్వాత చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు బేంబేలు ఎత్తిపోయి మాట్లాడుతున్నట్లుగా ఉంది.

వైయ‌స్ జగన్ గారు రోడ్ షో చేస్తున్నా...సభలలో ప్రసంగిస్తున్నా...సభలకు హాజరవుతున్న జనం జేజేలు పలుకుతున్న తీరు ప్రజలందరికి ప్రత్యక్షంగా కనిపిస్తోంది.జనంలో ఆదరణ తగ్గిందని జగన్ గారు ఇలాంటివి చేసుకోవాల్సిన అవసరం ఉందా...ఆదరణ ఎక్కువై ఆయన టూర్ ఆలస్యం అవుతుందని రాష్ర్టం అంతా గమనిస్తోంది.ఏదో ఒక ఊర్లో అయితే ఆ ఊర్లో క్రియేట్ చేశారనుకోవచ్చు.నాలుగు సిధ్దం సభలు జరిగాయి.మేమంతా సిధ్దం బస్సుయాత్ర సందర్భంగా ఎక్కడకు వెళ్లినా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు.జగన్ గారికి డ్రామాల ఆడటం గాని,నటించడం గాని సానుభూతికోసం ఏదో చేయడం అనే అలవాట్లు ఎప్పుడూ లేవు. 

ఆయనకు ఉన్నదల్లా ప్రజలకు తాను ఏది చేస్తానో అది చెప్పడం...మీకు మా ప్రభుత్వం నుంచి లబ్ది అందింది. మేలు జరిగింది అంటేనే తనకు తన పార్టీకి ఓట్లు వేయాలని ధైర్యంగా అడగటం మాత్రమే తెలుసు. సాయంత్రం నుంచి బస్సుయాత్రలో జగన్ గారు అదే మాట్లాడతారు. వైయస్సార్ సిపి పార్టీ పెట్టినప్పటినుంచి అదే శైలి ఇది అందరికి తెలుసు అని అన్నారు. ఇలా దాడి చేయించుకోవడం కుదిరే పనా...డ్రామా అనేవాళ్ళు దూరం నుంచి రాయి వేయించుకుని డ్రామా ఆడమనండి.ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ గా ఇక్కడే తగిలేలా చేయించుకుంటారా చేయించుకోగలరా...అది సాద్యం అయ్యే పనేనా. డ్రామా అని రుజువు చేయగలరా.అలా చేయలేరు. చంద్రబాబు,పవన్ కల్యాణ్ లకు అవన్నీ అనవసరం.వారికి కావాల్సిందల్లా జగన్ గారిపై ఉక్రోషం వెల్లగక్కడమే.

నిజం చెప్పాలంటే 13 వతేదీన 8.15 గంటల ప్రాంతంలో దాడి జరిగితే జగన్ గారు ఆ దాడిని ఓర్చుకుని ఆ తర్వాత రెండు గంటల పాటు బస్సుయాత్రలో పాల్గొన్నారు.దాడివల్ల వచ్చే నొప్పిని ఓర్చుకున్నారు.ప్రాధమిక చికిత్స చేయించుకున్నారు. ఎక్కడా కూడా గాయం చూపుతూ ప్రజల దగ్గర సానుభూతి పొందే ప్రయత్నం చేయలేదు.ఆ తర్వాతి రోజు వైద్యుల సూచనపై విశ్రాంతి తీసుకున్నారు.అదే చంద్రబాబు అయితే తన ప్రచారానికి వాడుకునే వారు. 2019లో వైజాగ్ ఎయిర్ పోర్టులో కత్తితో పొడిచి గాయం అయినా కూడా జగన్ గారు షర్ట్ మార్చుకుని ఫ్లైట్ ఎక్కి హైద్రాబాద్ లో చికిత్స తీసుకున్నారు.ఎక్కడా కూడా తన గాయం గురించి మాట్లాడలేదు.జగన్ గారు డ్రామా ఆడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.గతం కంటే మిన్నగా జగన్ గారికి ప్రజలలో ఆదరణ పెరిగింది.ఇదే సమయంలో ప్రతిపక్షాలకు ఆదరణ తగ్గిపోయింది.ఎక్కడికి వెళ్లినా దడి కట్టుకుని మీటింగ్ లు పెట్టుకుంటున్నారు.

గతంలో చంద్రబాబు అలిపిరి ఘటన జరిగితే చేతికి కట్టువేసుకుని ప్రచారంకోసం సానుభూతి కోసం ప్రయత్నించారు.ఇప్పుడు ప్రజలలో అయోమయం క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.మనిషికి దెబ్బతగిలితే కనీస సానుభూతి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు.దాడి జరిగింది ఖండిస్తున్నా అని చెబుతూనే డ్రామా అని కూడా చంద్రబాబు మాట్లాడుతున్నారు.రెండింటిలో ఒక దానికి స్టికాన్ అవ్వాలి కదా అని అన్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన రీతిలో కాకుండా అసభ్యంగా,అసహ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.ఇలా మాట్లాడటం గురించి వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయంటూ పవన్ కల్యాణ్ అనడాన్ని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ అలా మాట్లాడటం పిల్లఛేష్టలుగా అభివర్ణించారు. 

పధకం ప్రకారం జరిగిన దాడి ఘటనలో విచారణ జరిగి నిజం నిగ్గు తేలాలనేదే మా ఉద్దేశ్యం అని టిడిపి జనసేనలు కూడా అదే డిమాండ్ చేయాలని అన్నారు కాని వారి ఉధ్దేశ్యం మాత్రం రాజకీయం చేయాలని...ప్రజలలో కన్ ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. కేశినేని నాని,వెల్లంపల్లిలు కలసిి దాడి డ్రామా చేశారంటూ టిడిపి నేతలు విమర్శించడాన్ని ప్రస్తావించగా వాటిని కొట్టి పారేశారు.

Back to Top