విశాఖ‌లో ఘ‌నంగా వైయ‌స్ఆర్ సీపీ ఆవిర్భావ వేడుక‌

పార్టీ జెండాను ఆవిష్క‌రించి, కేక్ క‌ట్ చేసిన వైయ‌స్ఆర్ సీపీ రీజన‌ల్ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి

విశాఖ‌: విశాఖ‌ప‌ట్నం జిల్లా మ‌ద్దిల‌పాలెం పార్టీ కార్యాల‌యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని  ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ రీజన‌ల్ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం వైయ‌స్ఆర్ సీపీ జెండాను ఆవిష్క‌రించారు. వైయ‌స్ఆర్ సీపీ 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెడుతున్న సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు వైవీ సుబ్బారెడ్డి వైయ‌స్ఆర్ సీపీ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం కేక్ క‌ట్ చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొంద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో పార్టీ మహావృక్షంగా ఎదిగి అన్ని వ‌ర్గాల‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తును ఇస్తుంద‌ని చెప్పారు. పార్టీ జెండాను మోస్తున్న నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

Back to Top