అనంతలో ఘనంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు

అనంతపురం:  వైయ‌స్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు అనంతపురంలోని  జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్క‌రించారు.  మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళుల‌ర్పించారు.  పార్టీ శ్రేణులతో కలిసి కేట్‌ కట్‌ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెంట నడిచిన పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే వైయ‌స్‌ఆర్‌సీపీ లక్ష్యమని,  అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పరితపించే నాయకుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు.  

Back to Top