వైయస్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏకంగా తన కార్యాలయంలో బూడిత పంచాయితీలు, లిక్కర్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేడు నెలలు అవుతోంది, కానీ ప్రజలకిచ్చిన హామీ ఒక్కటీ అమలుచేయని చవట ప్రభుత్వంగా మరింది, ఈ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైయస్ఆర్‌సీపీని టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒక్క పనీ జరగడం లేదు, ఇంత దారుణమైన పాలన ఉంటుందని ఏ ఒక్కరూ అనుకుని ఉండరు, పాలన మొత్తం నిర్వీర్యమైంది. కడప వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఏమన్నారంటే.. సీఎం స్ధాయిలో సీఎంవోలో బూడిద పంచాయితీలు చేస్తున్నారు, ఇంతకంటే దారుణం ఉంటుందా, వైయస్ఆర్ జిల్లా ఆర్టీపీపీ బూడిదను కూడా కూటమి నాయకులు దోచుకుంటున్నారు, దీని పంచాయితీని సీఎం చంద్రబాబు సెటిల్ చేస్తున్నారు, ఇదే కాదు మట్టి, ఇసుక, లిక్కర్ ఇలా ప్రతీది దోచుకోవడమే, దోచుకోవడంలో పోటీ లేకుండా ఉండేందుకు సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారు, జిల్లాలోని పోలీస్ యంత్రాంగం అంతా బూడిద కాపలాకు వినియోగిస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది, ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఇలా వీటిపై దృష్టిపెట్టడం ఎంతవరకు సమంజసం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు, రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది, విత్తనాలు, ఎరువులు లేక అవస్ధలు పడుతున్నారు, శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని అంతా దిగువకు వదిలేస్తున్నారు, రబీకి అవసరమైన నీటిని నిల్వ చేస్తున్నారా అంటే అదీ లేదు, రిజర్వాయర్‌లు ఖాళీ అవుతున్నాయి, కేఆర్‌ఎంబీ వారు గుర్తించి చెబితే కానీ ఏపీ ప్రభుత్వానికి చలనం లేదు, ఏపీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానకురిసిన చందంగా మారింది అన్ని ప్రభుత్వ శాఖల్లో దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగుతోంది, దీనిని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుంది, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ఇది చేతగాని ప్రభుత్వంగా మారింది, ప్రజలే బుద్దిచెప్పే రోజు త్వరలో వస్తుందని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.