ఈసీ లేఖపై డీజీపీకి వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను గురువారం మంగళగిరి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల బృందం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ పేరుతో సర్క్యూలేట్‌ అయిన లేఖపై ఈ సందర్భంగా వారు డీజీపీ ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్‌, కైలే అనిల్‌ కుమార్‌, పార్థసారథి, మల్లాది విష్ణులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలో భాగంగా ఈ లేఖను సర్క్యూలేట్‌ చేసినట్టుగా నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ లేఖ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల బృందం డీజీపీని కోరింది. రమేష్‌కుమార్‌ పేరిట ప్రచారంలోకి వచ్చిన లేఖతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక  సమాచారాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు డీజీపీకి అందజేశారు. 

Back to Top