మంత్రి నారాయణ చిల్లర రాజకీయాలు

ఎమ్మెల్యే అనిల్‌ యాదవ్‌
 

 నెల్లూరు : ఓటమి భయంతో మంత్రి నారాయణ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ విమర్శించారు. గురువారం నెల్లూరులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాధరణలో కొట్టుకుపోతాడన్న భయంతో మంత్రి నారాయణ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘మంత్రి నారాయణ ఎంత దిగజారిపోయాడంటే... నేను ఏడాదిన్నర కిత్రం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... ఒక సైనికుడు యుద్ధానికి వెళ్లినప్పుడు తన చేతిలో రెండే ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. చనిపోవడమా లేదా శత్రువును చంపడమా. ఆ విధంగా ప్రతి కార్యకర్త  ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని చెప్పాను.

 
దాన్ని తీసుకొచ్చి మార్ఫింగ్‌ చేసి ఎన్నికల సభల్లో మాట్లాడనని చెప్పి వాళ్ల ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఇలా చిల్లర రాజకీయాలు చేయకుండా నాతో నేరుగా పోరాడమని మంత్రికి చెబతున్నాను. నేను గత ఐదేళ్లలో మంత్రి నారాయణను నిలదీసిన వీడియోలను రోజుకొకటి వేస్తారట. రోజుకొకటి కాదు గంటకో విడియో వేసుకో. నా వెనుక నెల్లూరు సిటీ ప్రజలు ఉన్నారు. నీ కళాశాలలో 80 మంది విద్యార్థులు చనిపోయారు. ఒక్క కుటుంబానైనా ఓదార్చారా? నువ్వా మానవత్వం గురించి మాట్లాడేది. మీ కూతురి కన్నా చిన్న వయసున్న 21ఏళ్ల అమ్మాయి మీ మెడికల్‌ కాలేజీలో చనిపోతే కనీసం చూడడానికి వెళ్లారా?’  అని నారాయణను నిలదీశారు. ఆ కూతురు చనిపోయినట్లు నా బిడ్డ మీ బిడ్డ చనిపోతే ఓటే వేస్తారా అని ప్రజలను ప్రశ్నించారు. డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది.. ఆలోచించి ఓటు వేయండని ప్రజలను కోరారు.

Back to Top