మిర్చి యార్డ్‌ పర్యటనకు ఎన్నికల కోడ్‌ వర్తించదు

వైయ‌స్‌ జగన్‌ను అడ్డుకునే కుట్ర జరుగుతోంది

మాజీ మంత్రి అంబటి రాంబాబు

గుంటూరు: వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి గుంటూరు పర్యటనపై కుట్ర జరుగుతోందని  మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ అంటూ వైయ‌స్‌ జగన్‌ను ఇబ్బంది పెట్టే ప్లాన్‌ చేస్తున్నారని అన్నారు. మిర్చి యార్డ్‌ పర్యటనకు ఎన్నికల కోడ్‌ వర్తించదు. కాబట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని వైయ‌స్‌ జగన్‌కు ఇవ్వాల్సిందేనని చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ..‘వైయ‌స్‌ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కుట్ర జరుగుతుంది. ఎన్నికల కోడ్ వంక పెట్టి వైయ‌స్‌ జగన్‌ పర్యటనలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, వాళ్లే ఇబ్బంది పడతారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మేము ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు.. ప్రచారం చేయడం లేదు. కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడటం లేదు. వైయ‌స్‌ జగన్‌ మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ వైయ‌స్‌ జగన్‌కు ఇచ్చి తీరాల్సిందే. పోలీస్ అధికారులు ఇది గుర్తుపెట్టుకోవాలి.

కూటమి సర్కార్‌ పాలనలో మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. మిర్చి రైతుల గోడు వినటానికి వైయ‌స్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైంది. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో గిట్టుబాటు ధర లేని పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసింది’ అని అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించారు. 

Back to Top