మీ చల్లని పాలనలో మేం కూడా చల్లగా ఉంటామన్నా

పైసా ఖర్చు లేకుండా ప్రతీ పథకం పొందుతున్నాం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో `వైయ‌స్ఆర్ ఓబీసీ నేస్తం` ల‌బ్ధిదారులు

తాడేపల్లి: అగ్రవర్ణాల్లోని పేద అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఆర్థిక చేయూత‌ను అందించాల‌నే సంక‌ల్పంతో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి `వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం` ప‌థ‌కానికి నేడు శ్రీ‌కారం చుట్టారు. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పకపోయినప్పటికీ అగ్ర‌వ‌ర్ణాలు రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియ, వెలమ, తదితర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక‌ సాయం అందించాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. 3,92,674 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.589 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జమచేశారు. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌తో మాట్లాడిన లబ్ధిదారులు ఏమన్నారంటే..

చాలా చాలా సంతోషంగా ఉంది..
``సార్‌ మాది కర్నూలు, మేం ఈబీసీ నేస్తం క్రింద 15 వేలు సహాయం పొందడానికి అర్హురాలినయ్యాను, చాలా ధన్యవాదాలు సార్, నా భర్త చిన్న గుమాస్తాగా పనిచేస్తున్నారు, మేం చాలా కష్టపడి పైకి వస్తున్నాం. నాకు ఒక సోదరుడిలా మీరు ఈ సహాయం చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా అగ్రవర్ణాలలో కూడా పేదవారు ఉన్నారని గుర్తించి మీరు సాయం చేస్తున్నారు. మా అమ్మ కూడా పింఛ‌న్  తీసుకుంటుంది, నా కొడుకులాగా ధన్యవాదాలు తెలపమని అమ్మ చెప్పింది, మా అమ్మ తరఫున కూడా మీకు ధన్యవాదాలు. విద్యా దీవెనలో మా అబ్బాయికి సాయం అందింది, చక్కగా చదివించుకుంటున్నాం, మేం మీకు రుణపడి ఉంటాం, దిశ యాప్‌ గురించి కూడా మాకు వలంటీర్లు చెప్పారు, మేం ధైర్యంగా బయటికి వెళుతున్నాం, రేషన్‌ కూడా ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారు, మీరు ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయి, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, మీరే మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, థ్యాంక్యూ సోమచ్‌ సార్‌.       - శ్రీదేవి, లబ్ధిదారు, కర్నూలు 

ఆత్మవిశ్వాసంతో బతకడానికి చాలా సహాయం చేస్తున్నారు..
అన్నా నేను ఈబీసీ పథకానికి అర్హురాలినయ్యాను, ఓసీల్లో పేదవారున్నారని మీరు గుర్తించారు. ఈ పథకం మాకు చాలా అవసరం, వలంటీర్‌ ఇంటికి వచ్చి మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పి ఇస్తున్నారు, నేను బ్యూటీ ప్రొడక్ట్స్‌ ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేస్తున్నాను, నాకు ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది.  మీరు సీఎం అయిన తర్వాత నా భర్తకు కూడా పెన్షన్‌ వస్తుంది, ఆయన పెరాలసిస్‌తో ఇబ్బంది పడుతున్నారు. నాకు సొంత ఇల్లు లేదు, కానీ ఇప్పుడు నాకు సొంతింటి కల నెరవేరింది, నా భర్త అనారోగ్యం వల్ల రేషన్‌కి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు రేషన్‌ ఇంటి వద్దే తీసుకుంటున్నాను. నవరత్నాల పథకాలు మాకు అందుతున్నాయి, మేం చాలా రుణపడి ఉంటాం, మేం ఆత్మవిశ్వాసంతో బతకడానికి చాలా సహాయం చేస్తున్నారు. ప్రాణాలున్నంత కాలం మేం ఎవరి మీద ఆధారపడకుండా మీరు భరోసా కల్పించారు. మీరు మహిళలందరినీ ముందుండి నడిపిస్తున్నారు. మా మహిళలందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సెలవు అన్నా.   - కొవ్వూరి లక్ష్మి, లబ్ధిదారు, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా

ఈ డబ్బుతో శారీ పెయింటింగ్‌ బిజినెస్‌ చేసుకుంటాను..
అన్నా.. నేను ఈబీసీ నేస్తంకు ఎంపికయ్యాను అని తెలిసి చాలా సంతోషించాను. ఇప్పటివరకూ మా ఓసీలకు సంక్షేమ పథకం లేదనుకున్నాను కానీ ఇప్పుడు ఈబీసీ పథ‌కం మాకు ఉంది. నేను ఈ డబ్బుతో శారీ పెయింటింగ్‌ బిజినెస్‌ చేసుకుంటాను. నా అన్న ఇచ్చిన డబ్బుతో నేను ధైర్యంగా వ్యాపారం చేసుకుని నా కాళ్ళపై నేను నిలబడతాను. గ్రామ సచివాలయ వ్యవస్ధ చాలా బావుంది, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఏకైక సీఎం మీరేనన్నా.. ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రతీ పథకం పొందుతున్నాను. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం మీరు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన ఘనత కూడా మీదేనన్నా, వారందరి ఆశీస్సులు మీకు ఉంటాయి. సొంతింటి కల నెరవేరుస్తున్నారు, మేం చాలా సంతోషంగా ఉన్నాం. మా అగ్రవర్ణ పేదలకు మీరు చాలా సాయం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మా మహిళలంతా మా అన్న ఉన్నారనే ధైర్యంతో ఉన్నాం, మళ్ళీ మళ్ళీ కూడా మీరే సీఎం అవ్వాలి, మీ చల్లని పాలనలో మేం కూడా చల్లగా ఉంటామన్నా.. థ్యాంక్యూ అన్నా.       - తూమాటి నాగజ్యోతి, లబ్ధిదారు, గుంటూరు
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top