పెన్షన్ల పంపిణీలో ఏపీ టాప్‌

24 కేటగిరీల్లో పెన్షన్లు మంజూరు ఏపీలో తప్ప ఏ రాష్ట్రంలోనూ లేదు

ప్రజలంతా బాగుండాలని కోరుకునే మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

అసెంబ్లీలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర

అసెంబ్లీ: దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున పెన్షన్ల పంపిణీ జరుగుతుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. సుమారు 62 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తూ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు దాదాపు రూ.48 వేల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. పెన్షన్ల పంపిణీపై ఎమ్మెల్యే రాజన్న దొర అసెంబ్లీలో మాట్లాడారు. 

‘రూ.75 ఉన్న పెన్షన్‌ను రూ.200 చేసి పేదలను, పండుటాకులను ఆదుకునే మానవత్వం ఉన్న మనిషిగా దివంగత మహానేత వైయస్‌ఆర్‌ నిరూపించుకున్నారు. అదే విధంగా నేడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.2500 పెన్షన్‌ అందజేస్తున్నారు. పక్క రాష్ట్రం ఒడిశాలో రూ.300 నుంచి రూ.500 పెన్షన్‌ అందిస్తున్నారు. భారతదేశంలో సామాజిక భద్రత పెన్షన్లు అందించడంలో ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు దీటుగా లేదు. మన రాష్ట్రం సుమారు 62 లక్షల మందికి అందజేస్తుంది. ఏ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడం లేదు. సుమారు 48 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రతి నెలకు రూ.16 వందల కోట్లు ఖర్చు చేసి ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్నారు. మనవడిగా, కొడుకుగా, అన్నగా, తమ్ముడుగా ఎవరికీ ఆపద వచ్చినా నేనున్నాను అని సీఎం వైయస్‌ జగన్‌ భరోసా ఇస్తున్నారు. 

టీడీపీ హయాంలో గిరిజనులకు సంబంధించి పీటీజీ జీవో ఇచ్చి 50 సంవత్సరాలకు పెన్షన్‌ అని అది సక్రమంగా అమలు చేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తరువాత పీటీజీలతో పాటు గిరిజనులందరికీ 50 సంవత్సరాలకు పెన్షన్‌ అందజేస్తున్నారు. 24 కేటగిరీల్లో పెన్షన్లు మంజూరు చేయడం ఏ రాష్ట్రంలోనూ లేదు. రూ.3 వేల చొప్పున పెన్షన్‌ అందుకునేవారు 7,46,633 మంది, రూ.5 వేలచొప్పున అందుకునేవారు 29,932, రూ.10 వేల పెన్షన్‌ అందుకునేవారు 13,750 మంది, రూ. 5వేల అభయ హస్తం పెన్షన్లు పొందేవారు 1,43,560, రూ.2500 పెన్షన్‌ అందుకునేవారు 52,40,718 మంది ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. ప్రజలు బాగుండాలని కోరుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని చెప్పారు. ప్రజలకు ఈ విధంగా సేవ చేస్తున్న ముఖ్యమంత్రి ఎల్లవేళలా బాగుండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు’ అని ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top