బాలకృష్ణ, పవన్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరిక

విజయవాడ: సీపీఐ రామకృష్ణ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పేదల కోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీ అవినీతి కేసులో అడ్డంగా దొరికి జైలు పాలైన చంద్రబాబును సమర్థించడం విడ్డూరంగా ఉందన్నారు. విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీకి సిద్ధాంతాలు, విలువలు ఏమీ లేవన్నారు. ప్రశ్నిస్తానని మాట్లాడే పవన్‌కు చంద్రబాబు స్కామ్‌లు కనిపించడం లేదా అని నిలదీశారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఆంధ్రరాష్ట్రంలో పేదరికం 12 నుంచి 8 శాతానికి తగ్గిందన్నారు. బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. 
 

Back to Top