నేడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న నేడు వైయ‌స్ఆర్ సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. తాడేప‌ల్లిలోని వైయ‌స్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ దిశానిర్ధేశం చేయనున్నారు. 

Back to Top