నాన్న హత్యకేసు దర్యాప్తుపై అనుమానాలు

కేసు పక్కదారి పట్టించడానికే మా కుటుంబంపై నిందారోపణలు

వైయస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: నాన్న హత్య కేసు దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయని వైయస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైయస్‌ సునీతా రెడ్డి అన్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.ఇందులో భాగంగానే తమ కుటుంబంపై నిందారోపణలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. సంఘటనా స్థలంలోనే సీఐ శంకరయ్య ఉన్నారన్నారు.మేం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన తర్వాత కేసు పెట్టమని చెప్పాల్సి వచ్చిందన్నారు. జరిగింది హత్యా అని, కేసు పెట్టాలని ఇన్‌స్పెక్టర్‌ శంకరయ్యకు తెలియదా  అని ప్రశ్నించారు.సీన్‌లో లేని మాకు అనుమానం వస్తోందన్నారు. సీన్‌లో ఆయనకు మేం చెప్పాల్సి వచ్చిందన్నారు.దీనిబట్టి చూస్తే ఆయనకు ఏదైనా కవర్‌ చేయాలని ప్రయత్నించారా అని అనుమానం వ్యక్తం చేశారు.  సీఐ ఎందుకు అలా ప్రవర్తించారని అనుమానం వ్యక్తం చేశారు.

ఆయన సమక్షంలోనే మృతదేహాన్ని తరలించారని, కట్లు కూడా కట్టారన్నారు. అలా చేయడం తప్పని సీఐకు తెలియదా అని ప్రశ్నించారు.పంచనామా జరగకుండా మృతదేహాన్ని తరలిస్తుంటే సీఐ ఏం చేశారని ప్రశ్నించారు.అక్కడున్న మా వాళ్లకు షాక్‌లో ఏం అర్థంకాలేదు అనుకుందాం.. మరి అన్ని తెలిసిన సిఐకి ఏమైందని ప్రశ్నించారు.సీఐకి రూల్స్‌ బాగా తెలుసు కదా..ఆయన కూడా ఈ క్రైంలో ఏమైనా భాగస్వామూలా అని ప్రశ్నించారు.ఆయనకు  ఎవరైనా ఆదేశాలిచ్చారా అని ప్రశ్నించారు. ఈ నేరాన్ని తారుమారు చేయడానికి ఆయనపై ఎవరున్నారని ప్రశ్నించారు.అధికారులు ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా..దాని కోసం మా కుటుంబంపై నిందారోపణలు వేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

 

Back to Top