ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారు

చంద్రబాబు ప్రత్యేకహోదాను తాకట్టు పెట్డారు

ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ జగన్‌ భయపడరు

వైయస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యం

సత్యవేడు ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

 

చిత్తూరు జిల్లా: ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని.. ఐదేళ్లలో చంద్రబాబు ఎన్నో మోసాలు చేశారని వైయస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ అన్నారు.సత్యవేడు ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు.

ప్రసంగం ఆమె మాటల్లోనే..

కాంగ్రెస్,టీడీపీలు  కుట్రలు చేసి వైయస్‌ జగన్‌ను ఎన్నో కష్టాలు పెట్టారు.ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైయస్‌ జగన్‌ ధైర్యంగా ఎదుర్కొన్నారు. అక్రమంగా కేసులు పెట్టి ఆస్తులు అటాచ్‌ చేసినప్పుడే వైయస్‌ జగన్‌ భయపడలేదు. ఈ రోజు భయపడతారా అని అడుగుతున్నా..చంద్రబాబు ప్రజాస్వామ్యాని ఖూనీ చేస్తున్నారు.విలువలు మంటగలుపుతున్నారు.దేవాలయాలు లాంటి అసెంబ్లీ గౌరవాన్ని చంద్రబాబు మంటగలిపారు.వైయస్‌ జగన్‌ను ఎన్నాడయినా అసెంబ్లీలో మాట్లాడనిచ్చారా.. ఒక ప్రశ్నకు సమాధానం ఎప్పడైనా ఇచ్చారా అని అడుగుతున్నా..చంద్రబాబు..23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి మీ పార్టీలో గెలిపించి ఎందుకు అసెంబ్లీలో పెట్టుకోలేదని అడుగుతున్నా..అసెంబ్లీలో చివరి వరుకు కూడా వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలుగానే వారి పేర్లు ఉన్నాయి.అందుకే అసెంబ్లీని అట్టిపెట్టుకునే ఉంటే ప్రజలకు న్యాయం జరగదని పాదయాత్రతో వైయస్‌ జగన్‌ మీ ముందుకు వచ్చారు.ఎన్నో సమస్యలపై వైయస్‌ జగన్‌ పోరాడారు.వైయస్‌ జగన్‌ విలువలు,విశ్వసనియత గల్గిన నాయకుడు.వైయస్‌ఆర్‌సీపీలోకి ఎవరు వచ్చిన తమ పార్టీకి,తమ పదవులకు రాజీనామాలు చేసి మాత్రమే పార్టీలోకి రావాలనే  విలువలు పాటిస్తున్నారు. చంద్రబాబుకు,వైయస్‌ జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

వైయస్‌ఆర్‌ హయాంలోనే శ్రీసిటీ నిర్మాణం జరిగిందన్నారు. వైయస్‌ హయాంలోనే ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. వైయస్‌ఆర్‌లాగే మాట తప్పని..మడమ తప్పని నాయకుడు జగన్‌.. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారు.ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం. వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తాం పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తాం. చంద్రబాబు తమ స్వార్థ ప్రయోజనాలు కోసం ప్రత్యేకహోదాను సైతం తాకట్టుపెట్టాడు.రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలు కూడా చోరీచేస్తాడు.సర్వేల పేరుతో చంద్రబాబు లక్షల ఓట్లు తొలగించారు.ప్రత్యేకహోదా వైయస్‌ జగన్‌వల్లనే నిలబడింది. చంద్రబాబు.. బీజేపీతో కలిసి ఉన్నంత కాలం తల్లి కాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్‌ అన్నారు.మూడు నెలల క్రితం రాహుల్‌తో కలిశాడు. నేడు బీజేపీ,కేసీఆర్‌లతో జగన్‌ కలిసిపోయారని దుష్ఫ్రచారం చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ ఎప్పడూ బీజేపీ,కేసీఆర్‌తో లేడు.. వైయస్‌ జగన్‌కు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవలసిన అవసరం లేదు.సింహం సింగిల్‌గానే వస్తోంది.ప్రత్యేకహోదా ఇస్తానని బీజేపీ,కాంగ్రెస్‌లు మోసం చేశాయి.మన రాష్ట్రం బాగుపడాలంటే  ప్రత్యేకహోదా అవసరమని వైయస్‌ జగన్‌ నిరంతరం పోరాడుతున్నారన్నారు.ప్రత్యేకహోదా ద్వారా రాష్ట్రానికి అనేక రాయితీలు,పరిశ్రమలు,ఉద్యోగాలు వస్తాయి.

వైయస్‌ జగన్‌ నిత్యం ప్రజల కోసం ఆలోచిస్తారు.మన రాష్ట్రంలో 25 ఎంపీలను గెలిపించుకుంటే ప్రత్యేకహోదా సాధించగలం.హోదాపై ఎవరు సంతకం పెడతారో వారికే మద్దతిస్తాం.ఒకసారి వైయస్‌ఆర్‌ పాలన గుర్తుచేసుకోండి..ఆనాడు వైయస్‌ఆర్‌ అందించిన సుపరిపాలన గుర్తుచేసుకోండి. వైయస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యం.ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుందాం.

Back to Top