వైయస్‌ఆర్‌ పాలన గుర్తుకు తెచ్చుకోండి

కందుకూరు సభలో వైయస్‌ విజయమ్మ

ధర్మానికి, అధర్మానికి..న్యాయానికి, అన్యాయానికి మధ్య యుద్ధం

విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని కోరుతున్నా..

వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి..

 

ప్రకాశం: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ సూచించారు.  వైయస్‌ఆర్‌ ఆశయాల స్ఫూర్తితో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిందని ఆమె తెలిపారు. వైయస్‌ఆర్‌ కుటుంబానికి, ప్రజలకు మధ్య 40 ఏళ్ల అనుబంధం ఉందని ఆమె పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం  ఇస్తే తండ్రిలాగే మంచి సుపరిపాలన అందిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన బహిరంగ సభలో వైయస్‌ విజయమ్మ మాట్లాడారు. విజయమ్మ  ఏమన్నారంటే..ఆమె మాటల్లోనే..

 జగన్‌బాబును మీ ఆశ్వీరాదాలే నడిస్తున్నాయని, ఒక్కసారి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనను గుర్తుతెచ్చుకోవాలని వైయస్‌ విజయమ్మ అన్నారు.కందుకూరు ప్రచార సభలో ఆమె ప్రసంగించారు.టీడీపీ పాలనలో ఎక్కడ చూసిన అన్యాయం,మోసమే తప్ప అభివృద్ధి లేదన్నారు. ధర్మానికి,అధర్మానికి యుద్ధం జరుగుతుందన్నారు. న్యాయానికి,అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టాలని కోరారు. వైయస్‌ఆర్‌ ఆశయాల కోసం పనిచేయాలన్నారు.వైయస్‌ఆర్‌ ప్రజలందరిని కడుపులో పెట్టుకుని రక్షణ కల్పించారన్నారు.

వైయస్రా జశేఖర్‌రెడ్డి మరణం అనంతరం రాష్ట్రం పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉందన్నారు.మా కుటుంబానికి వచ్చిన కష్టం కంటే ఈ రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కవగా ఉందన్నారు.రాజశేఖర్‌రెడ్డి మరణం అనంతరం జగన్‌బాబు వచ్చిన పరిస్థితులు మీ అందరికి తెలుసు. జగన్‌ ఎప్పడైతే కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారో మా కుటుంబంపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.అనే కుట్రలు చేసి క్షోభ పెట్టారన్నారు.ఓదార్పు యాత్ర చేస్తానని జగన్‌ ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం నడుచుకున్నారన్నారు.ప్రజల సమస్యల కోసం వైయస్‌ జగన్‌ ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ప్రజలే మా కుటుంబం అని, వైయస్‌ఆర్‌ ఆశయ సాధనలో వైయస్‌ జగన్‌ తొమ్మిది సంవత్సరాలుగా నిత్యం ప్రజలతోనే ఉంటున్నారన్నారు.

వైయస్జ గన్‌ మాట ఇస్తే చేస్తాడు..సాధిస్తాడు అని అన్నారు. మా కుటుంబంలో జరిగిన సంఘటనలను ప్రజలందరికి తెలుసు అన్నారు.మామ వైయస్‌ రాజారెడ్డి గారిని 20 సంవత్సరాలు కిందట హత్య చేశారు.ఆ రోజును చంపినవారికి ఎవరు సాయం చేశారో అందరికి తెలుసు.తొమ్మిది సంవత్సరాల క్రితం రాజశేఖర్‌రెడ్డిగారిని పొగొట్టుకున్నాం.ఆయన మరణం  అనుమానస్పదంగానే మిగిలిపోయింది.నాలుగు నెలల క్రితం విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో  వైయస్‌ జగన్‌బాబును కూడా హత్యా చేయాలని ప్రయత్నించారు.దానిపై విచారణ కూడా లేదన్నారు.మొన్న మరిది వివేకానందరెడ్డిని కిరాతకంగా చంపారు.మా కుటుంబంలో మరణించిన నలుగురు కూడా ప్రజలకోసం నిలబడినవారే..మా కుటుంబం మీద కక్ష కట్టారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ముందుకు రావడానికి మీ అభిమానమే కారణమన్నారు.ప్రజల ఆశీర్వాదలే జగన్‌ను నడిపిస్తున్నాయని తెలిపారు.

తొమ్మిది సంవత్సరాల్లో మా కుటుంబం పడిన క్షోభ ఎవరు పడలేదు. అనేక కుట్రలను భరించామన్నారు.నా భర్తను పొగొట్టుకున్న సమయంలో నా కుమారుడు జగన్‌బాబును జైల్లో పెట్టి దూరం చేశారన్నారు.నా బిడ్డను మీరే కాపాడుకోవాలన్నారు.మీ ఆశీర్వాదం,దేవుడి దయ వల్లనే నా బిడ్డ పెద్ద గండం నుంచి బయటపడ్డారన్నారు.మరిది వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ దుష్ఫ్రచారం చేస్తుందని, మా కుటుంబం  అలాంటి కుటుంబం కాదని, ఇంట్లో వారినే కాదు.బయటవారిని ప్రేమించే కుటుంబం అని అన్నారు.రాజారెడ్డి గారిని చంపినప్పుడు వైయస్‌ఆర్‌ సీఎంగా ఉన్నారని, చంపినవాళ్లు ఎదురుగా తిరుగుతున్న చట్టం తనపని తను చేసుకుపోతుందని చెప్పిన వ్యక్తిత్వం వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి గారిదన్నారు. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు ఉందా..అని ప్రశ్నించారు.

గతంలో వైయస్‌ఆర్‌ చెప్పింది.చెప్పలేనిది కూడా ప్రజలకు చేసి ఓటు అడిగారని గుర్తుచేశారు.నాయకుడంటే అలా ఉండాలన్నారు.ప్రజలందరూ జగన్‌ వైపే ఉన్నారన్నారు.పరిటాల రవి హత్య కేసుల్లో జగన్‌బాబు చేశారని చంద్రబాబు నానాయాగీ చేశారని, నా కుమారుడు తప్పు చేసి ఉంటే ఉరి తీయమని,సీబీఐ విచారణ వేయాలని వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదన్నారు.చంద్రబాబుపై బాంబు దాడి జరిగినప్పుడు నిరసనగా వైయస్‌ఆర్‌ ధర్నా చేశారని తెలిపారు.వివేకానందరెడ్డి మరణిస్తే చంద్రబాబు పుత్రరత్నం పరవశిస్తున్నారని తెలిపారు. ఎందుకు పరవశిస్తున్నారో తెలియడంలేదన్నారు. ఒక్కసారి ప్రజలందరూ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి సంక్షేమ పథకాలను గుర్తుచేసుకోవాలన్నారు.

ప్రజల కోసం ఎంత పోరాటం చేశారన్నారు.కేజీ బేసిన్‌ గ్యాస్‌ తరలిపోకుండా  వైయస్‌ఆర్‌ ఎంతోగానో పోరాటం చేశారన్నారు.వైయస్‌ఆర్‌ లాగే మాట తప్పని,మడమ తిప్పని నేత వైయస్‌ జగన్‌అని అన్నారు.ఆయన నాన్నగారిలా రాష్ట్రానికి మంచి చేయడానికి వైయస్‌ జగన్‌ వచ్చారన్నారు.ప్రజలకు మేలుచేసే నవరత్నాలాంటి పథకాలు అందిస్తారని తెలిపారు.వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వం ఎలాంటిదో తొమ్మిది సంవత్సరాలు చూశారన్నారు.మీ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు తీసుకొచ్చారని,ఆయన హయాంలో 70 శాతం పూర్తియిందన్నారు. నేడు చంద్రబాబు పాలనలో పూర్తిచేయలేదన్నారు.గుడ్లకమ్మ ప్రాజెక్టు 90 శాతం అయ్యిందని,మిగిలిన పనులు కూడా చంద్రబాబు పాలనలో పూర్తవలేదన్నారు. చిన్న ప్రాజెక్టు కూడా పూర్తవలేదన్నారు.ఐదేళ్ల కాలంలో చంద్రబాబుకు  ప్రజలు గుర్తుకు రారని, ఎన్నికల సమయంలో గుర్తుకువస్తారన్నారు.

వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారన్నారు.పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్న చందాన ఉందన్నారు. పులి పులే..నక్క నక్కే అని తెలిపారు.వైయస్‌ఆర్‌  రైతు భరోసా కింద రైతులకు  ప్రతి సంవత్సరం 12,500 ఇస్తారన్నారు. వడ్డీలేని రుణాలు ఇస్తారు.,తొమ్మిది గంటల ఉచిత కరెంట్‌ ఇస్తారు. రైతులకు ఉచితంగా బోర్లు వేస్తారు. రైతుల భీమాను ప్రభుత్వమే భరిస్తుందన్నారు.రైతు మరణిస్తే..ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇస్తాం..అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామన్నారు. వ్యవసాయం పండగ అని చెప్పి..రైతులకు వైయస్‌ఆర్‌ ఎంతో మేలు చేశారని గుర్తుచేశారు.చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ కూడా  ప్రజలకు  అందకుండా పోయిందన్నారు.ఆరోగ్యశ్రీ ద్వారా  వైద్యం ఎక్కడ చేయించుకున్నా ఆరోగ్యశ్రీని ు వర్తింపచేస్తారని తెలిపారు.మా కుటుంబాన్ని అక్కున చేర్చుకున్న ప్రజలందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేశారు

Back to Top