ఒక్క హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి అవసరమా..?

ఏంచేశావని ఓటేయాలి..చంద్రబాబూ..

చంద్రబాబు మొదటి సంతకానికే దిక్కులేదు..

బాబు పాలనలో మహిళలకు భద్రత లేదు.

మంచినీరు దొరకడంలేదు..మద్యం ఏరులై పారుతోంది

వైయస్‌ఆర్‌ లేని లోటు వైయస్‌ జగన్‌ తీరుస్తారు..

 

తూర్పుగోదావరి:ఒక్క హామీకూడా నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు మనకు అవసరమా అని వైయస్‌ విజయమ్మ ప్రశ్నించారు.రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతుందన్నారు.ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించి మళ్లీ మోసపోవద్దని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. 

ప్రసంగం ఆమె మాటల్లోనే..

గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటువేసి మోసపోయాం.ఒకసారి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలన గుర్తుకుతెచ్చుకోమని అడుగుతున్నా.« ధర్మానికి,అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది.విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టలని కోరుతున్నా..ప్రజలకు వైయస్‌ కుటుంబానికి ఉన్న అనుబంధం 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా వైయస్‌ఆర్‌ను భుజస్కందాలపై మోసి సీఎంను చేసుకున్నారు. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించారు.అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందించారు.కొన్ని లక్షల మందిని పేరుపెట్టి పిలిచే చనువు వైయస్‌ఆర్‌కు ఉంది.జిల్లాకు వెళ్ళినప్పుడు ప్రజలకు ఏమిచేయాలనేది ఆయన మైండ్‌లో బ్లూప్రింట్‌  ఉందేమో.వైయస్‌ఆర్‌ హయాంలో వ్యవసాయాన్ని పండగ చేశారు.వైయస్‌ఆర్‌ కాలంలో రైతులకు ఎంతో మేలు చేశారు. జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టారు.రైతును రాజు చేయాలని ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు.కరెంట్‌ బకాయిలను రద్దు చేశారు.

పంటలకు గిట్టుబాటు ధరలను తీసుకొచ్చారు.అందిరిక పెన్షన్లు అందాలనే ఉద్దేశ్యంతో 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు.జబ్బులొస్తే అప్పులపాలు కాకూడదని మహానేత ఆరోగ్యశ్రీని తెచ్చారు. ఆరోగ్యశ్రీ తీసుకుని వచ్చి లక్షల మందికి కార్పొరేట్‌ వైద్యం చేయించి ప్రాణాలు కాపాడారు.108,104 ద్వారా అనేక మందికి ప్రాణాలు పోశారు.ఫోన్‌ చేసిన పది నిముషాలకు 108 అంబులెన్స్‌ వచ్చేది..చంద్రబాబు హయాంలో 108ను పూర్తిగా నిర్వీర్యం చేశారు.చదువుకు పేదరికం అడ్డుకాకుండదనే ఉద్దేశ్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టి లక్షల మందిని చదివించి ఇంజనీర్లు,డాక్టర్లుగా, ఉన్నత ఉద్యోగాలుగా తీర్చిదిద్దారు.మైనార్టీలకు నాలుగుశాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు.వైయస్‌ఆర్‌ పాలనలో కుల,మతా,పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారు.వైయస్‌ఆర్‌ ప్రభుత్వంలో కరెంట్,ఆర్టీసీ,చార్జీలు ఒకసారి కూడా పెంచలేదు.ఎటువంటి పన్నులు పెంచలేదు.అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఒకపైసా కూడా పెంచలేదు.మన ప్రభుత్వ పాలన పరిశీలించడానికి 13 జిల్లాల నుంచి అధికారలు వచ్చారని తెలిపారు. ఒక పైసా పన్ను పెంచకుండా ఎలా సంక్షేమపథకాలు అమలు చేస్తున్నారని అడిగేవారన్నారు. ఇది ప్రపంచంలోనే రికార్డు ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ అన్నారు.

దేశమంతాట వైయస్‌ఆర్‌ను రోల్‌మోడల్‌గా గుర్తించారన్నారు.2009లో వైయస్‌ఆర్‌ చెప్పినవి,చెప్పనివి చేసి ప్రజలను ఓటు అడిగారు.అభివృద్ధి చూసే ఓటు వేయాలని అడిగారు.వైయస్‌ఆర్‌ మరణించే చివర క్షణం దాకా ప్రజలు గురించే ఆలోచించారు.వైయస్‌ఆర్‌ మరణం తర్వాత ఈ తొమ్మిది సంవత్సరాల్లో జరిగిన పరిస్థితులు మీ అందరికి తెలుసు.వైయస్‌ఆర్‌ మరణంతో వందలాది మంది గుండెలు ఆగిపోయాయి.మరణించిన వారి ప్రతి కుటుంబాన్ని నేను పరామర్శిస్తానని వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేశారు.ఇచ్చిన మాట ప్రకారం వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేపట్టారు.రాష్ట్రం మొత్తం మా కుటుంబాన్ని ఎంతో ఆదరించింది.తెల్లవారు జామున కూడా ప్రజలు మేల్కొని తమ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.మీ రుణం ఎన్నటికి మరిచిపోలేను. వైయస్‌ జగన్‌ ఓదార్పుయాత్ర చేయడం కాంగ్రెస్‌కు నచ్చలేదు. ఎన్నో అడ్డంకులు పెట్టింది. వైయస్‌ మరణం అనంతరం ఆయన  వెంట ఉన్నవారు కూడా తోడుగా లేరు.ప్రజలే మా కుటుంబానికి అండగా ఉన్నారు..కాంగ్రెస్,టీడీపీలు కలిసి వైయస్‌ జగన్‌పై కుట్రలు పన్నారు.సీబీఐ,ఈడీ విచారణలు జరిపారు.ఆస్తులను అటాచ్‌ చేశారు.విచారణ పేరుతో పిలిచి వైయస్‌ జగన్‌ను జైల్లో పెట్టారు.మా కుటుంబాన్ని అన్నిరకాలుగా వేధింపులకు గురిచేశారు. వైయస్‌ జగన్‌ను 11 కేసుల్లో అన్యాయంగా ఇరిక్కించారు.వైయస్‌ఆర్‌ బతికుండగా ఎన్నడూ బయటకు రాలేదు.

వైయస్‌ జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు..118 మంది ఎమ్మెల్యేలను,1 ఎంపీని గెలిపించుకోవడానికి బయటకురావడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రజలంతా మాకు అండగా నిలబడ్డారు.వైయస్‌ జగన్‌ జైల్లో ఉన్న పదహారు నెలలు తప్పితే మిగతా కాలమంతా ప్రజలతోనే ఉన్నారు.తొమ్మిది సంవత్సరాల్లో ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారు.ప్రత్యేకహోదా కోసం, ప్రతి సమస్య కోసం గల్లి నుంచి ఢిల్లీ దాకా  కడుపుమాడ్చుకుని దీక్షలు చేశారు.వైయస్‌ఆర్,జగన్,షర్మిలమ్మ పాదయాత్రలో ప్రజలంతా మా వెంటే ఉన్నారు.ఎంతో ఆదరించారు.ప్రజల బాధలు వైయస్‌ జగన్‌ విన్నారు..కష్టాలు చూశారు. ప్రజలందరికి వైయస్‌ జగన్‌ అండగా ఉంటారు.మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకోవాలంటే జగన్‌ను సీఎం చేసుకోవాలి.చంద్రబాబు వైయస్‌ఆర్‌ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైయస్‌ కుటుంబానికి ఆస్తులు లాక్కోవడం తెలియదు. ఆస్తులను పంచడమే తెలుసు.అందరిని ప్రేమించడమే తెలుసు.

చంద్రబాబుకు పేమ ఇవ్వడం తెలియదు.ప్రేమను తీసుకోవడం కూడా తెలియదు.సుదీర్ఘ పాదయాత్రలో ప్రతిఒక్కరి కష్టాన్ని జగన్‌ చూశారు.వైయస్‌ఆర్‌ లేని లోటును వైయస్‌ జగన్‌ తప్పక తీరుస్తారు.చంద్రబాబు 650పైగా వాగ్ధానాలు చేశాడు.ఒక్కటైనా నెరవేర్చాడా అని అడుగుతున్నా..చంద్రబాబు మొదటి సంతకానికి దిక్కులేకుండా పోయింది.చంద్రబాబు రైతులను అప్పుల్లోకి నెట్టాడు.బ్యాంకులకు వెళ్ళితే నేడు రుణం లభించే పరిస్థితి లేదు. వడ్డీలేని రుణాలు తీసుకోవలసిన రైతులను బ్లాక్‌లిస్ట్‌లో పడేశాడు.తాగునీరు,సాగునీరు తెచ్చుకునే పరిస్థితి లేదు.వైయస్‌ జగన్‌ ప్రతి ఏటా రైతుల చేతుల్లో 12,500 రూపాయలు పెడతానని చెప్పిన తర్వాత..నేడు చంద్రబాబు అన్నదాత సుఖీభవ అంటున్నాడు.మీ భవిష్యత్‌ మాభద్రత అంటున్నారు.గత తొమ్మిది సంవత్సరాలు,ఈ ఐదేళ్లు ఎలాంటి భద్రత ఇచ్చావయ్యా..చంద్రబాబు అని అడుగుతున్నా..అక్కాచెల్లెమ్మలకు పెద్దన్నయ్యను అని చెప్పుకుంటున్నాడు.ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడిపోయావని అడుగుతున్నాను.కొత్తగా పసుపు–కుంకుమ అని మళ్లీ మోసం చేస్తున్నారు.బాబు పాలనలో మహిళలకు భద్రత లేదు.రితితేశ్వరి కేసులో నిందితులకు చంద్రబాబు రక్షణగా నిలిచారు.మహిళలపై వేధింపుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులే ఉన్నారు.గ్రామాల్లో మంచినీరు దొరకడంలేదు..మద్యం ఏరులై పారుతోంది.రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు.కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడంలేదు.చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు జగన్‌ను తల్లికాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్‌ అన్నాడు.నేడు రాహుల్‌తో కలిసిన చంద్రబాబు..  బీజేపీ,కేసీఆర్‌తో జగన్‌ కలిశాడంటూ దుష్ఫ్రచారం చేస్తున్నాడు.

వైయస్‌జగన్‌ ఎన్నాడూ బీజేపీ,కేసీఆర్,కాంగ్రెస్‌తో లేడు.కేసీఆర్‌కు,మన రాష్ట్రానికి ఏమిటి  సంబంధం అన్ని అడుగుతున్నా..కేసీఆర్,మనం కలిసి పోటి చేస్తున్నామా..  రైతులకు  వైయస్‌ఆర్‌ భరోసా ద్వారా పంట వేసే సమయానికి మే నెలలో సంవత్సరానికి రూ.12వేలు పెటుబడి భరోసాగా మీ చేతులకే ఇస్తాం. పంట బీమా చేస్తాం. వడ్డీలేని పంట రుణాలు ఇస్తాం. రూ.3వేల కోట్లుతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రకృతి విపత్తుల సహాయనిధికి మరో 4వేల కోట్లు ఇస్తాం.డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరుకు పొదుపు సంఘాల్లో మీకు అప్పు ఎంతైతే ఉందో ఆ మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతికి ఇస్తాం. సున్నావడ్డీకే రుణాలు ఇచ్చి బ్యాంకుల వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ అక్కలకు కార్పొరేషన్ల ద్వారా 75 వేలు దఫాలుగా వైయస్‌ఆర్‌ చేయత పథకం ద్వారా ఉచితంగా ఇస్తాం. ఆరోగ్యశ్రీ దావరా 1000 రూపాయలు దాటిని ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా చేస్తాం. దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం ఇస్తాం.ఎంత ఖరీదైనా ఆపరేషన్‌ అయినా,వైద్యం అయినా సరే ఉచితంగా అందిస్తాం.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలనెలా ప్రత్యేకంగా పింఛను ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మన ప్రభుత్వం వచ్చాక పార్టీలు,కులాలు,మతాల,వర్గాలకు అతీతంగా పేదలందరికి పక్కా ఇళ్లు కట్టిస్తాం.ప్రతి ఇల్లు అక్కచెల్లెమ్మల పేరు మీదే రిజిష్టర్‌ చేయిస్తాం.ఆ ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మన ప్రభుత్వం రాగానే గ్రామ సచివాలయాల ద్వారా యువతకు గ్రామానికి 10 ఉద్యోగాలు 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటిర్‌ ద్వారా ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే అందేలా డోర్‌ డెలివరీ చేస్తాం. గ్రామ వాలంటిర్‌కు 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తాం. ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్‌ రద్దు చేస్తాం.దశలవారీగా మద్యం షాపులను రద్దుచేస్తాం. వైయస్‌ జగన్‌ చేసిన పోరాటాల వల్లే హోదా నేటికి బతికుంది. ప్రత్యేకహోదా వస్తే ఉద్యోగాలు,పరిశ్రమలు వస్తాయి.హోదా ఇస్తామన్న వాళ్లకే కేంద్రంలో వైయస్‌ఆర్‌సీపీ మద్దతు ఇస్తుంది.పట్టిసీమ ప్రాజెక్టులో 400 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కాగ్‌ తప్పుబట్టిందన్నారు.బహిరంగంగానే 22 శాతం కమిషన్లు తీసుకున్నారు.

ఇటువంటి ముఖ్యమంత్రి అవసరమా అని అడుగుతున్నా..వైయస్‌ఆర్‌ మెట్టప్రాంతాన్ని కోనసీమగా మార్చడానికి పుష్కర ఎత్తిపోత్తల పథకం, ఏలేరు ఆధునికీకరణ,గోదావరిని ఆధునికీకరణను చేయాలని వేల కోట్లు కేటాయించారు.80 శాతం పూర్తి చేస్తే..నేడు 20 శాతం కూడా పూర్తిచేయలేని ప్రభుత్వాలు ఉన్నాయి.వైయస్‌ఆర్‌ పుష్కర ఎత్తిపోతల పథకం కింద 13 లిప్ట్‌లు పెట్టి లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇస్తే..14వ లిఫ్ట్‌ పెట్టమని ప్రజలు అడుగుతున్నారు..పెట్టారా అని అడుగుతున్నా..ముసురుమిల్లి ప్రాజెక్టు పూర్తయ్యింది. దానికి గేట్లు పెట్టడానికి పదేళ్లు పట్టిందా అని అడుగుతున్నా..ఏలేరు ఆధునికీకరణ పూర్తిచేసాడా అని అడుగుతున్నా..నవరత్నాలతో వైయస్‌ జగన్‌ మీ అందరి జీవితాల్లో  వెలుగులు నింపుతారు.ఒక్క హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి అవసరమా అని అడుగుతున్నా..వైయస్‌ఆర్‌ పాలనను ఒకసారి గుర్తుచేసుకోండి.. 

Back to Top