ప్రజలంతా మా కుటుంబమే..

వైయస్‌ జగన్‌ సారథ్యంలో మళ్లీ రాజన్న రాజ్యం

విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టండి..

మోసాలు,అవినీతి.. ఇదే చంద్రబాబు అభివృద్ధి

కులాల మధ్య చంద్రబాబు చిచ్చు..

చంద్రబాబుకు ఓటేసి మళ్లీ మోసపోవద్దు

వైయస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ

 

కర్నూలు జిల్లా: అబద్ధాలు,మోసాలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ గౌరవఅధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ ధ్వజమెత్తారు. కులాల మ«ధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.చంద్రబాబు పాలనలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు.డోన్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.

ప్రసంగం ఆమె మాటల్లోనే...

కర్నూలు జిల్లా: ఒకసారి వైయస్‌ఆర్‌  సుపరిపాలనను గుర్తుకుతెచ్చుకోవాలి.గత ఎన్నికల్లో టీడీపీ ఓటువేసి  చాలా మోసపోయాం.చంద్రబాబు మోసాలు,హామీలతో ప్రజలను మోసం చేశాడు. ధర్మానికి,అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టాలి.వైయస్‌ఆర్‌ కుటుంబానికి, ప్రజలకు మధ్య 40 సంవత్సరాలు అనుబంధం ఉంది. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సంక్షేమ పథకాలు అమలుచేశారు.జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించారు.రైతును రాజును చేయాలని అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారు.  ప్రాజెక్టులను 80 శాతం వరుకు పూర్తిచేశారు.రెండు రూపాయలకే బియ్యం ఇచ్చారు. పేదలు అనారోగ్యంతో అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు.లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించి ప్రాణాలు నిలబెట్టారు. అదేవిధంగా 108,104 అంబులెన్స్‌లు ప్రవేశపెట్టి ఎందరో ప్రాణాలను కాపాడారు.పేదలు ఉన్నత చదువులు చదవాలని ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టి ఎందరినో ఉన్నత ఉద్యోగాల్లో నిలబెట్టారు.ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్‌ఆర్‌దే.కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు గ్యాస్‌ ధర పెంచితే..అక్కాచెల్లెమ్మలకు భారం కాకూడదని ఆ భారాన్ని వైయస్‌ఆర్‌ ప్రభుత్వమే భరించింది.

వైయస్‌ఆర్‌ హయాంలో 71 లక్షల మందికి పెన్షన్‌ ఇచ్చింది. వైయస్‌ఆర్‌ ప్రభుత్వం కుల,మత,పార్టీల కతీతంగా సంక్షేమ పథకాలు అందించారు.వైయస్‌ఆర్‌ హయాంలో ఎటువంటి చార్జీలు,ట్యాక్స్‌లు పెంచలేదు. ఒక పైసాకూడా పెంచకుండా సంక్షేమ పథకాలు అమలుచేశారు.వైయస్‌ఆర్‌ 2009 ఎన్నికల్లో అభివృద్ధినిచూసి ఓటు వేయమని అడిగారు.వైయస్‌ఆర్‌ మరణం తర్వాత వైయస్‌ జగన్‌ ప్రజలతోనే ఉన్నాడు.వైయస్‌ఆర్‌ మరణంతో వందల గుండెలు ఆగిపోయాయి.మరణించిన కుటుంబాలకు ఓదార్చడానికి  వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేపట్టారు.వైయస్‌ జగన్‌ చేపట్టిన ఓదార్పుయాత్ర కాంగ్రెస్‌కు నచ్చలేదు. అనుమతి ఇవ్వలేదు.వైయస్‌ జగన్‌ ప్రజల కిచ్చిన మాట కోసం సోనియాగాంధీని ధిక్కరించి ఓదార్పు యాత్ర కోసం కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారు.వైయస జగన్‌ను ప్రజలు ఎంతో ఆదరించారు.వైయస్‌ జగన్‌పై కాంగ్రెస్,టీడీపీలు అనేక కుట్రలు చేశారు.సీబీఐ,ఈడి దాడులు చేయించి..ఆస్తులను అటాచ్‌ చేయించారు. రకరకాలుగా వేధించారు.చివరకు వైయస్‌ జగన్‌ను విచారణ పేరుతో పిలిచి జైల్లో పెట్టారు.ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారు.

ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు.గల్లి నుంచి ఢిల్లీ వరుకు పోరాటాలు చేశారు. కడుపుమాడ్చుకుని ప్రజలు కోసం పోరాడారు.తొమ్మిది సంవత్సరాల్లో కాంగ్రెస్,టీడీపీలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా..తన కష్టం ఎప్పడూ ప్రజలకు చెప్పుకోలేదు. ప్రజల కష్టాలే పంచుకున్నారు.వైయస్‌ జగన్‌ మాట ఇస్తే చేస్తాడు..సాధిస్తాడు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర ద్వారా మీ కష్టాలు,బాధలు చూశారు..విన్నారు.. మీకు అండగా ఉంటారు.వైయస్‌ఆర్‌ బతికుండగా నేను ఎప్పుడూ బయటకు రాలేదు.వైయస్‌ జగన్‌ను జైల్లో పెట్టినప్పుడు బయటకు రావాల్సి వచ్చింది.18 ఎమ్మెల్యేలను ,ఒక ఎ ంపీని గెలిపించుకోవడానికి బయటకు రావాల్సి వచ్చిందన్నారు.పెద్ద పెద్ద నాయకులు ఈ జిల్లాలో ఉన్న డోన్‌ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు.వైయస్‌ఆర్‌ హయాంలోనే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది.62 కోట్లు ఖర్చుచేసి డోన్‌ ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చారు.33 కోట్లుతో ప్లై ఓవర్‌ నిర్మించారు.స్టేడియం కూడా  నిర్మించాలని వైయస్‌ఆర్‌ అనుకున్నారని,ఆయన మరణంతో నిలిచిపోయిందన్నారు.10  కోట్లతో ఏపీ గురుకుల పాఠశాల,మోడల్‌ స్కూల్‌ వంటివి వైయస్‌ఆర్‌ హయాంలోనే వచ్చాయి.డోన్‌ శివార్లలో వేలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చి కాలనీలు ఏర్పాటుచేశారు.ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ జిల్లా నియోజకవర్గం డోన్‌ డిగ్రీ కాలేజిలో కనీసం సైన్స్‌ సబ్జెక్ట్‌ చదువుకోవడానికి కూడా లేదు.అది కూడా వైయస్‌ఆర్‌ కాలంలోనే వచ్చింది.

హాంద్రీనీవా ప్రాజెక్టును 6,800 కోట్ల అంచనాతో  యుద్ధప్రాతిపదికన వైయస్‌ఆర్‌ మొదటి దశ పూర్తిచేశారు.రెండవ ఫేజ్‌ కూడా 80 శాతం పూర్తిచేశారు.చంద్రబాబు హయాంలో మిగిలిన పనులు కూడా పూర్తిచేయలేదు.వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హాంద్రీనీవా నీరు చెరువుల్లోకి తెచ్చుకుందాం.డోన్‌లో మైనింగ్‌ మాఫియా జరుగుతుంది. మరుగుదొడ్లు కట్టించే కార్యక్రమంలోనూ కోట్లు దోచుకున్నారు.డోన్‌లో శాంతిభద్రతలు లేవు. ప్రజలకు ష్రశాంతత లేదు. అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి.బీసీలకు న్యాయం జరిగిందంటే అది వైయస్‌ఆర్‌ పాలనలోనే.ఒకసారి వైయస్‌ఆర్‌ పాలన గుర్తుకుతెచ్చుకుందాం.వైయస్‌ జగన్‌ ప్రజలు మేలు చేయాలనే  తపనతో ఉన్నారు. నవరత్నా పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలనే ఆరాటంతో ఉన్నాడు.ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైయస్‌ జగన్‌ను గెలిపించుకుంటే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది.

 

 

Back to Top