గిరిజనులంటే ఎందుకంతా నిర్లక్ష్యం చంద్రబాబు

చంద్రబాబు అవసరానికి అన్న అని చెప్పకుంటారు

చంద్రబాబుకు ఓటు అడిగే హక్కులేదు

విలువలకు,విశ్వసనీయతకు ఓటేయాలి..

ప్రజలకు మంచి చేయాలనే ఆరాటంతో జగన్‌ ఉన్నారు..

జగన్‌ మాటమీద నిలబడే వ్యక్తి

సీతంపేట ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

 

శ్రీకాకుళం జిల్లా: అన్నంటే అన్నింటికి అండగా ఉండాలి..చంద్రబాబు తన అవసరానికి అన్న అని చెప్పకుంటున్నారని వైయస్‌ విజయమ్మ ధ్వజమెత్తారు. అన్నంటే అన్నింటికీ అండగా ఉండాలి.. కానీ కేవలం తన అవసరానికి మాత్రమే అన్న అని చెప్పుకుంటూ చంద్రబాబు ప్రజల ముందుకు వస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఎన్నికల ముందు పసుపు- కుంకుమ అంటూ మహిళలను మరోసారి వంచించేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ విజయమ్మ ప్రసంగించారు. 

ప్రసంగం ఆమె మాటల్లోనే..

న్యాయానికి,అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది.ధర్మానికి,అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. విలువలకు,విశ్వసనీయతకు ఓటు వేయాలని కోరుతున్నా.ఎక్కడ చూసిన అన్యాయం,అక్రమం,మోసం..ఇసుకు నుంచి మట్టి దాకా..మట్టి నుంచి బొగ్గు దాకా..బొగ్గు నుంచి రా«జధాని భూములు దాకా..ఆలయ,దళితుల భూములను కూడా వదలిపెట్టడం లేదు.వైయస్‌ కుటుంబంతో ఉన్న అనుబంధం ఒకసారి గుర్తుచేసుకోండి.40 సంవత్సరాల అనుబంధం.వైయస్‌ఆర్‌ను 30 సంవత్సరాలు మీ భుజస్కందాలపై మోసుకుని సీఎం చేసుకున్నారు. ఆయన ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు.వైయస్‌ఆర్‌ మరణం తర్వాత జరిగిన విషయాలు ఒకసారి గుర్తుకు చేసుకోవాలి.తొమ్మిది సంవత్సరాల క్రితం వైయస్‌ఆర్‌ మరణిస్తే వందల మంది ప్రాణాలు వదిలారు.ఇచ్చిన మాట కోసం వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేశారు.వైయస్‌ జగన్‌ ఓదార్పు చేయడం కాంగ్రెస్‌కు నచ్చలేదు.

ఓదార్పుయాత్రల వైయస్‌ జగన్‌ను ప్రజలు అక్కున చేర్చుకున్నారు.వైయస్‌ జగన్‌ను ప్రజలను నాయకుడిగా నిలబెట్టుకున్నారు. వైయస్‌ కుటుంబం ఎప్పుడూ ప్రజలకు రుణపడి ఉంటుంది.కాంగ్రెస్‌ నిరంశకుత్వం,టీడీపీ వికృత చేష్టలతో వైయస్‌ జగన్‌ను జైల్లో పెట్టారు.పదహారు నెలలు నా బిడ్డను దూరం చేశారు.జగన్‌ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు.ప్రజల కోసం ఎన్నో పోరాటలు చేశారు.ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటాలు చేశారు. ప్రతి సమస్య సమస్య పరిష్కారానికి జగన్‌  పోరాటం చేశారు.పాదయాత్ర ద్వారా మీ కష్టాలు  తెలుసుకున్నారు. నేనుఉన్నానని వైయస్‌ జగన్‌ భరోసా ఇస్తున్నారు.వైయస్‌ జగన్‌ మాట మీద నిలబడే వ్యక్తి.వైయస్‌ జగన్‌ అందరికి అండగా ఉంటారు.వైయస్‌ కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.వైయస్‌ఆర్‌  ఉన్నప్పుడు ఎన్నడూ బయటకురాలేదు. జగన్‌ను జైల్లో పెట్టినప్పుడు 18 మంది ఎమ్మెల్యేలను గెలుపించుకోవడానికి బయటకు రావడం జరిగింది.మీ సహకారంతో ఆ రోజు 16 మందిని గెలిపించారు.

ఈ రోజు మీ ముందు నిలబడి ఉన్నామంటే అది మీ అభిమానమే కారణం.ప్రజలందరూ మా కుటుంబం.వైయస్‌ఆర్,జగన్‌లు ఎప్పడూ ప్రజలను కుటుంబంగా భావించారు.చంద్రబాబుకు ప్రేమలు,విలువలు  తెలియదు. మీ కొడుకును మాత్రమే ప్రేమించారు..అందుకే మూడు ఉద్యోగాలు ఇచ్చారు.చంద్రబాబు ఆయన అమ్మను కూడా చూడలేదు. సోదరుడిని కూడా చూడలేదు.పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్‌ను కూడా వెన్నుపోటు పోడిచారు.ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వాడుకుని వదిలేశారు.వైయస్‌ఆర్,జగన్‌లు ప్రజల కోసం ప్రాణం పెట్టారు.నమ్ముకున్నవారి కోసం ఎంతకైనా పోరాటే తత్వం వారిది.నాన్న ఒంటరిగా పోలేదు. ప్రజలను కుటుంబంగా ఇచ్చి వెళ్ళారని జగన్‌ ఎన్నో సార్లు చెప్పారు.ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎప్పడూ కూడా ఓటు బ్యాంక్‌గానే చూశాడు. పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.వైయస్‌ఆర్‌ హయాంలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి  చూపించారు.

వైయస్‌ఆర్‌ హయాంలో రాష్ట్రంలో మొత్తం మీద 32 లక్షల ఎకరాలు పేదవారికి ఇచ్చారు.  గిరిజనులకు 14 లక్షలు భూములు ఇచ్చారు.ఆ భూముల పేరుతో పట్టాలు కూడా ఇచ్చారు.ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలని, పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని,ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారికి కార్పొరేట్‌ వైద్యం అందించారు. 108,ఫీజురీయింబర్స్‌ కూడా తీసుకువచ్చారు.పాలకొండలో వరద కరకట్టలు నిర్మించారు.సీతంపేటలో డిగ్రీ కాలేజి తీసువచ్చారు. అనేక సంక్షేమ పథకాలు వైయస్‌ఆర్‌ తీసుకొచ్చారు.శ్రీకాకుళం జిల్లా అంటే వైయస్‌ఆర్‌కు చాలా ఇష్టం.రాయలసీమ వంటిదే శ్రీకాకుళం కూడా అని, వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. వంశధార ప్రాజెక్టుకు 700 కోట్లు ఖర్చుపెట్టి 70 శాతం పూర్తిచేశారు.నేడు 30 శాతం కూడా పూర్తిచేయలేకపోయారు.వైయస్‌ఆర్‌ బతికుంటే ప్రాజెక్టు పూర్తి అయ్యి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అయ్యేంది.తాగు,నీరు ప్రజలకు అందించాలని అనేక ప్రాజెక్టులను వైయస్‌ఆర్‌ తీసుకొచ్చారన్నారు.ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు..ఓట్లు వేయించుకుని అంతా నిర్లక్ష్యం ఎందుకు..చంద్రబాబు ఏంచేశాడని ఓట్లు అడుగుతున్నారు.

చంద్రబాబుకు ఓటు అడిగే హక్కులేదు.టీడీపీ హయాంలో కనీసం గిరిజనులకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా మంత్రి పదవిని కేటాయించారు.దీన్ని బట్టి గిరిజనులంటే చంద్రబాబుకు ఎంత నిర్లక్ష్యం అర్థమవుతుంది.కోర్టు మొట్టికాయలు వేసేవరుకు గిరిజన సలహామండలి కూడా వేయలేదు.ఎమ్మెల్యేలు మెంబర్లు గా ఉండాలి. ఎమ్మెల్యే కానివారిని మెంబర్లుగా నియమించారు.ఇంతవరుకు ఎస్టీ కమిషన్‌ లేదు..195 ఎస్టీ హాస్టళ్లను మూసివేశారు.ఈ ప్రాంతానికి తిత్లీ తుపానులో పండతోటలు సర్వనాశనం అయ్యాయి.తిత్లీ  తుఫాను బాధితులకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు.పసుపు–కుంకుమ పేరుతో చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారు.గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు. వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలు కల్పించారు.చంద్రబాబు దళారీగా పని చేస్తున్నాడు.ఏనుగులు మీ పంటలను నాశనం చేస్తుంటే చంద్రబాబు పట్టించుకున్నాడా..గిరిజనులను ప్రతివిషయంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నాడు.వైయస్‌ఆర్‌ మరణంతో  అన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి.తెట్టంగిని ఆదర్శ గ్రామం అన్నాడు.

 ఏమైనా చేశాడా గ్రామానికి, శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తానన్నాడు చేశాడా..వైయస్‌ఆర్‌ ఇందిరమ్మ గ్రామాల పేరుతో అన్ని సౌకర్యాలు ఇచ్చారు. చంద్రబాబు హయాంలో రోడ్లు లేవు,కరెంటు,తాగునీరు లేదు. ఇంటిపన్నులు పెంచేశారు.వైయస్‌ఆర్‌ ఒక పైసా కూడా ట్యాక్స్‌లు పెంచకుడా ప్రభుత్వాన్ని నడిపారు.ఇది ప్రపంంచలోని రికార్డు..నేడు చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఛార్జీలు మూడుసార్లు పెంచారు.కరెంటు చార్జీలు పెంచారు. భూముల రిజిస్ట్రేషన్లు కూడా భారీగా పెరిగాయి.వైయస్‌ఆర్‌ శాచునేషన్‌ పద్దతిలో ప్రతి  కుల,మత,పార్టీలకు అతీతంగా సంక్షేమపథకాలు అమలు చేశారు.ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేదు.చంద్రబాబు ఎంతో మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారు. చంద్రబాబు మనుషులకే పథకాలు అందుతున్నారు.జిల్లాల్లో పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. జగన్‌ అధికారంలోకి వచ్చాక పోడుభూములకు పట్టాలిస్తాం.జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. మీ పిల్లలి బడికి పంపితే చాలు మీ చేతికే సంవత్సరానికి 15 వేలు ఇస్తాం. 1000 రూపాయలు దాటిని ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా చేస్తాం.

దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం ఇస్తాం. ఎంత ఖరీదైనా ఆపరేషన్‌ అయినా,వైద్యం అయినా సరే ఉచితంగా అందిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలనెలా ప్రత్యేకంగా పింఛను ఇచ్చే ఏర్పాటు చేస్తాం.వైయస్‌ఆర్‌ హయాంలో ఫోన్‌ చేసిన 10 నిముషాలకు 108 అంబులెన్స్‌ వచ్చేంది.లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడారు.నేడు చంద్రబాబు హయాంలో 108,104 పరిస్థితి దారుణంగా ఉంది.జలయజ్ఞం ద్వారా వైయస్‌ఆర్‌ మొదలు పెట్టిన అన్ని ప్రాజెక్టులను జగన్‌ పూర్తిచేస్తారు.  గ్రామ సచివాలయాల ద్వారా యువతకు గ్రామానికి 10 ఉద్యోగాలు ఇస్తారు. 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటిర్‌ ద్వారా ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే అందేలా డోర్‌ డెలివరీ చేస్తాం. గ్రామ వాలంటిర్‌కు 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తాం.దీని కోసం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతాం.డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరుకు పొదుపు సంఘాల్లో మీకు అప్పు ఎంతైతే ఉందో ఆ మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతికి ఇస్తాం.సున్నావడ్డీకే రుణాలు ఇచ్చి బ్యాంకుల వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ అక్కలకు కార్పొరేషన్ల ద్వారా 75 వేలు దఫాలుగా వైయస్‌ఆర్‌ చేయత పథకం ద్వారా ఉచితంగా ఇస్తాం. రైతులకు వైయస్‌ఆర్‌ భరోసా ద్వారా పంట వేసే సమయానికి మే నెలలో సంవత్సరానికి రూ.12వేలు పెటుబడి భరోసాగా మీ చేతులకే ఇస్తాం. వడ్డీలేని పంట రుణాలు ఇస్తాం. రూ.3వేల కోట్లుతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.ప్రకృతి విపత్తుల సహాయనిధికి మరో 4వేల కోట్లు కేటాయిస్తారు. అవ్వా,తాతలకు పింఛన్లు రూ.3వేలు పెంచుకుంటూ పోతాం. వైయస్‌ఆర్‌ కంటే మంచి పాలన తేవాలని జగన్‌ తాపత్రయం పడుతున్నారు.ఒక్కసారి అవకాశం ఇవ్వండి.

 

 

Back to Top