తిరుమ‌ల ఘాట్‌రోడ్డును పరిశీలించిన టీటీడీ చైర్మన్‌

శరవేగంగా మరమ్మత్తులు చేయించాల‌ని అధికారుల‌కు ఆదేశం

తిరుప‌తి: తిరుమలకి వెళ్లే రెండవ ఘాట్ రోడ్డు ధ్వంసం కావ‌డంతో టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప‌రిశీలించారు. గత కొంత కాలంగా కురుస్తున్న వర్షాలకి భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. బుధవారం ఉదయం 5.40 గంటల ప్రాంతంలో భారీ సైజు టన్నుల‌ కొద్ది బరువున్న రాయి పైనుంచి పడటంతో ఘాట్ రోడ్డు నాలుగు ప్రాంతాలలో భారీగా కోతకు గురయ్యింది. దీంతో అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేశారు. మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు రెండవ ఘాట్‌ రోడ్‌లో పూర్తిగా వాహనాలు నిలిపివేయడంతో అలిపిరిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. మొదటి ఘాట్‌ రోడ్డు నుంచి విడతల వారీగా తిరుమలకు వెళ్లడానికి వాహనాలకు అనుమతిస్తున్నారు. రెండవ ఘాట్ రోడ్డును టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఘాట్ రోడ్డులో నాలుగు ప్రాంతాలలో రోడ్డు ద్వంసం అయింది. దేవుని దయతో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘాట్ రోడ్డును త్వరలో నిపుణుల కమీటి పరిశీలిస్తుంది. వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, ఎంత ఖర్చు అయినా వీలైనంత త్వరగా ఘాట్ రోడ్డును సిద్దం చేస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top