అవినీతి, అబద్ధానికి మారుపేరు చంద్రబాబు

ఓట్ల కోసం పెద్ద అన్ననని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు

రిషితేశ్వరి, వనజాక్షి ఘటనల్లో బాబులోని అన్న చచ్చిపోయాడా..?

మహిళలను లాఠీలతో కొట్టించిన దుర్మార్గుడు చంద్రబాబు

మాయమాటలు నమ్మి మోసపోకండి

రాజన్న రాజ్యం కోసం ఫ్యాన్‌ గుర్తుపై ఓటేయండి

జగనన్న వస్తేనే అందరి కుటుంబాల్లో సంతోషం

ఉండి ప్రచార సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల

 

పశ్చిమగోదావరి: చంద్రబాబు లాంటి అన్న ఉంటే అంతకు మించిన దురదృష్టవంతురాలు ఉండదు. అవినీతి, అబద్ధం, అహంకారానికి మారుపేరు చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో వైయస్‌ షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి వైయస్‌ షర్మిల మాట్లాడుతూ..  

ఐదు సంవత్సరాలు వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉంటే ఐదేళ్లలో ఒక్క రూపాయి చార్జీలు, ఏ పన్నులు పెంచలేదు. సంక్షేమం, అభివృద్ధిని అద్భుతంగా చేసి చూపించిన వ్యక్తి వైయస్‌ఆర్‌. నీది ఏ కులం అని అడగలేదు. ఏ మతం, అని అడగలేదు. ఆఖరికి పార్టీలు కూడా అడగలేదు. మన, పర తేడా లేకుండా మేలు చేసిన వ్యక్తి రాజన్న. 

రైతులకు, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని మొదటి సంతకం పెట్టాడు. ఐదేళ్లు చంద్రబాబు మొదటి సంతకానికి విలువ లేకుండా పోయింది. పసుపు – కుంకుమ అని భిక్షం వేసినట్లుగా ఇస్తున్నాడు. అది కనీసం వడ్డీకి కూడా సరిపోదు. చంద్రబాబు డ్రామాలు చూసి మోసపోకండి. మభ్యపెట్టడానికి పసుపు – కుంకుమ పేరుతో డబ్బులు ఇస్తానని చెబుతున్నాడు. ఐదేళ్లు మహిళల కోసం ఏమీ చేయలేదు. ఎన్నికలు వచ్చాయని మీ పెద్ద అన్నని అని ఓటు వేయండి అని అడుక్కు తిరుగుతున్నాడు. అన్న అంటే తోబుట్టువుకి తోడుగా ఉండేవాడే అన్న. అక్కచెల్లెమ్మలకు కష్టకాలంలో తోడుగా ఉండేవాడు. ఇచ్చిన మాట తప్పనివాడే అన్న. ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయనివాడు అన్న అవుతాడు. వనజాక్షి చంద్రబాబుకు చెల్లెలు లాంటిది కాదా.. నడిరోడ్డున టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఆమె జుట్టుపట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. చంద్రబాబులోని అన్న అప్పుడు చనిపోయాడా.. మళ్లీ నిసిగ్గుగా అదే చింతమనేనికి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చాడు. 

రిషితేశ్వరి విద్యార్థి చంద్రబాబుకు చెల్లెలు లాంటిది కాదా.. బాబురావు అనే టీడీపీ మనిషి వల్ల ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు చంద్రబాబులోని అన్న చనిపోయాడా.. మహిళలు ఎంతో మంది ఆక్వా కల్చర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ వల్ల కాలుష్యం జరుగుతుందని ఆందోళన చేస్తే వారిపై లాఠీచార్జీ చేసి జైల్లో కూడా పెట్టించాడు. అప్పుడు చంద్రబాబులోని అన్న చనిపోయాడా.. అంగన్‌వాడీ మహిళలు జీతాల కోసం ధర్నాలు చేస్తే వారిపై లాఠీచార్జీ చేయించాడు. మధ్యాహ్నం భోజన కార్మికులను కూడా లాఠీలతో కొట్టించాడు. చంద్రబాబు లాంటి అన్న ఉంటే అంతకు మించిన దురదృష్టవంతురాలు ఉండదు. 

విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు.. ఫీజురియంబర్స్‌మెంట్‌ చేయడం లేదు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రుల లిస్టు నుంచి తీసేశాడు. పేదవారికి మెరుగైన వైద్యం లేకుండా చేస్తున్నాడు. పోలవరం మూడేళ్లలో పూర్తి చేస్తానన్నాడు.. ఇప్పటి వరకు పూర్తి చేయలేదంటే.. చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం లేదు. రాజధాని విషయంలో నాకు అనుభవం ఉంది నాకు ఓటేయండి హైదరాబాద్‌ లాంటి రాజధాని కడతానని ఒక్క శాశ్వత భవనం, ఒక్క ఫ్లైఓవర్‌ అయినా కట్టాడా..? కేంద్రం ఇచ్చిన రూ. 2500 కోట్లు ఏమయ్యాయి. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క శాశ్వత భవనం కట్టలేదు కానీ మరోసారి అధికారం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడంట. 

బాబు వస్తే జాబు వస్తుందన్నాడు. చంద్రబాబు కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. పప్పుకు కనీసం జయంతికి, వర్థంతికి కూడా తేడా తెలియదు. ఒక్క ఎన్నిక కూడా గెలవని పప్పును చంద్రబాబు మూడు శాఖలకు మంత్రిని చేశాడు. సామాన్య ప్రజలకు ఉద్యోగాలు లేవు. నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా ఆంధ్రరాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది బీజేపీ మనకు అన్యాయం చేస్తుంటే ద్రోహం చేస్తుంటే చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో కలిసి సంసారం చేశారు. బీజేపీ, చంద్రబాబు కలిసి ప్రత్యేక హోదాను నీరుగార్చారు. ప్రత్యేకహోదా కోసం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పోరాటాలు చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి పదవులకు రాజీనామాలు కూడా చేశారు. చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని హోదా కావాలి.. ప్యాకేజీ వద్దు అంటున్నాడంటే దానికి కారణం వైయస్‌ జగన్‌ కారణం. 

చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దమ్ము లేదు. ఎన్నికలు వచ్చాయి పాత  హామీలు పాతరబెట్టి కొత్త అబద్ధాలు చెబుతున్నాడు. తెలుగుదేశం పార్టీవారు మీ ఇంటికి వచ్చి ఓట్లు అడిగితే.. ఫీజురియంబర్స్‌మెంట్‌ బాకీ తీర్చమని అడగండి. ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు ఇస్తానన్నాడు. టీడీపీ నేతలు వస్తే డబ్బులు ఇచ్చాకే ఓట్లు అడగమనండి. విద్యార్థులకు ఐప్యాడ్లు, మహిళలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తానన్నాడు. నిరుద్యోగులకు భృతి రూ. 2 వేలు ఇస్తానన్నాడు. ఐదేళ్లలో ప్రతి ఇంటికి రూ. 1.20 లక్షలు అయింది. తెలుగుదేశం పార్టీ వారు ఇంటికి వచ్చి ఓట్లు అడిగితే ముందు బాకీ సంగతి తీర్చమనండి. పక్కా ఇళ్లు మాట ఏమైందని గట్టిగా నిలదీయండి. చేనేతలు, మహిళలు, రైతుల రుణాల మాఫీ ఏమైందని అడగండి. బాబు వస్తే జాబు కాదు కరువు వచ్చింది. అందుకే నువ్వు మాకు వద్దు అని చెప్పండి. బైబై బాబు అని చెప్పండి. 

పొత్తులన్నీ చంద్రబాబు పెట్టుకొని వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లుతున్నాడు. సూటిగా చెబుతున్నాం. బీజేపీతో, కాంగ్రెస్‌తో, కేసీఆర్‌తో పొత్తు లేదు. మాకు పొత్తులు అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైయస్‌ జగన్‌ సింగిల్‌గానే బంపర్‌ మెజార్టీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నారు. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గుంపుగా కాంగ్రెస్, జనసేనను తీసుకొస్తున్నాడు. 11వ తేదీ పోలింగ్‌లో ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి రైతుకు మే నెలలోనే రూ. 12,500లు ఇస్తారు. రైతు నష్టపోకుండా గిట్టుబాటు ధర కోసం రూ. 3 వేల కోట్లతో నిధి కూడా ఏర్పాటు, ప్రకృతి వైపరీత్యాలకు రైతులను ఆదుకునేందుకు రూ. 4 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణమంతా నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతారు. మళ్లీ సున్నావడ్డీకే రుణాలు అందిస్తారు. ప్రభుత్వమే ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఉచితంగా ఇంజనీరింగ్, డాక్టర్‌ పెద్ద చదువులు చదివిస్తుంది. తల్లులు పిల్లలను బడికి పంపిస్తే రూ. 15 వేలు ఇస్తారు. అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేలు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు రూ. 3 వేల పెన్షన్, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, ఆరోగ్యశ్రీకి పునర్జీవం తీసుకువస్తాం. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. మీ సేవ చేసుకునే అవకాశం రాజన్న కొడుకు జగనన్నకు ఇవ్వాలని కోరుతున్నాం. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాఘురామ కృష్ణంరాజును గొప్ప మెజార్టీతో గెలిపించాలి. ఎమ్మెల్యే అభ్యర్థి నర్సింహరాజు అన్నను గెలిపించాలని కోరుతున్నాం. ఫ్యాన్‌ గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్లు, గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం.  

తాజా వీడియోలు

Back to Top