తండ్రీకొడుకులు రాష్ట్రాన్ని లూటీ చేశారు

మల్కీపురం సభలో వైయస్‌ షర్మిల

ఎవరు తోడొస్తే..వాళ్లతో కలిసి వస్తున్నారు నక్క చంద్రబాబు

వైయస్‌ జగన్‌ సింగిల్‌గానే..బంపర్‌ మెజారిటీతో గెలుస్తారు

చంద్రబాబు ప్రత్యేక హోదాను నీరుగార్చారు

బాబు మళ్లీ హోదా కావాలనడానికి కూడా జగనన్నే కారణం

చంద్రబాబుకు మళ్లీ అవవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తారు

రాజన్న రాజ్యంలో రైతులు బాగుపడతారు

కౌలు రైతులకు కూడా పథకాలు అమలు

రాజోలు:  చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ కలిసి రాష్ట్రాన్ని లూటీ చేశారని వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిల విమర్శించారు. నలభై ఏళ్లలో ఎంత అవినీతి జరిగిందో..ఈ ఐదేళ్లలో అంత అవినీతి జరిగిందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీకి ఎవరితోనూ పొత్తు లేదని, వైయస్‌ జగన్‌ సింహం..సింగిల్‌గానే వస్తున్నారని, చంద్రబాబు నక్క ..అందుకే ఎవరు తోడు వస్తే వారితో కలిసి వస్తున్నారని ఎద్దేవా చేశారు. మీ భవిష్యత్తు– నా బాధ్యత అంటున్న చంద్రబాబు మాయదారి మాటలు న మ్మొద్దని సూచించారు. వైయస్‌ఆర్‌సీపీ బంపర్‌ మెజరిటీతో గెలుస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని చెప్పారు. రాజోలు నియోజకవర్గంలోని మల్కీపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ షర్మిల ప్రసంగించారు.

 

  • దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏపీకి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి. ఇలాంటి పథకాలను రూపొందించాలని, ఆ పథకాలను ఇలా అమలు చేయాలని చెప్పి..చేసి చూపించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్‌ఆర్‌ ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచలేదు. అన్నీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. నీది ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఏ పార్టీ అని అడగలేదు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు మేలు చేసిన నాయకుడు వైయస్‌ఆర్‌ మాత్రమే.
  • ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ..వెన్నుపోటు, అబద్ధాలు, అవినీతి, అరాచకాలకు మారుపేరు. రైతులకు మొత్తం రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారు. మొదటి సంతకానికే దిక్కు లేకుండా చేశారు. రైతులను దగా చేశారు. డ్వాక్రా మహిళల మొత్తం రుణాలు మఫీ చేస్తామన్నారు. ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. ఎంగిలి చేయ్యి విదిలిస్తున్నారు. విద్యార్థులకు ఫూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. పేదవాడికి జబ్బు వస్తే ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాలి. చంద్రబాబుకు జబ్బు చేస్తే కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్తున్నారు. పేదలను గవర్నమెంట్‌ ఆసుపత్రికి వెళ్లాలని శాసిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్నాళ్లు కూడా గైనకాలజిస్టు లేడట. 
  • పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం రూ.60 వేల కోట్లకు అంచనాలు పెంచారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానని చంద్రబాబు వాగ్ధానం చేశారు. నిజంగా చంద్రబాబు మాటమీద నిలబడే వ్యక్తి అయితే ఈపాటికి పోలవరం పూర్తి అయ్యేది. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పాత మేనిఫెస్టోను తన పార్టీ వెబ్‌ సైట్‌లో పెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు. ఇప్పుడు కొత్త మేనిఫెస్టో తయారు చేశారు. ఆయనను నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. టీడీపీ కొత్త మేనిఫెస్టోలో ఈ ఐదేళ్లు తీర్చని వాగ్ధానాలు పొందుపరిచారు. ఇంకా 50 శాతం వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోలోని వాగ్ధానాలను వారి ఐడియాలు అన్నట్లుగా చెప్పుకున్నారు.
  • గతంలో హైదరాబాద్‌ను తానే కట్టినట్లు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఏమైంది..మన రాజధానిలో కనీసం ఒక్క పర్మి¯ð ంట్‌ బిల్డింగ్‌ అయినా కట్టారా? కేంద్రం రాజధాని కోసం రూ.250 కోట్లు డబ్బులు ఇచ్చిందట. ఆ డబ్బులు ఏమైనట్లు? ఆ డబ్బంతా చంద్రబాబు బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. చంద్రబాబు తీరు కూడా అలాగే ఉంది. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఇంకా ఐదేళ్లు ఈయనకు అధికారం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తారట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తారట. మన చెవిలో పూలు పెడతారట.
  • బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? మీకు వచ్చిందా తమ్ముడు..అన్నా..మీ కొడుక్కు వచ్చిందా? చంద్రబాబు కొడుకు లోకేష్‌కు వచ్చింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఈ పప్పుకు తెలివి ఉందా అనుకుంటే..ఈయనకు కనీసం జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదు. అ, ఆలు రావు కానీ..అగ్రతాంబులం తనకే అన్నారట. ఒక్క ఎన్నికలో కూడా ఈ పప్పు గెలవలేదు. ఏ అర్హత, ఏ అనుభవం ఉందని మూడు శాఖలకు మంత్రిని చేశారు. 
  • ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరిలాంటిది. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ నీరుగార్చారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేశారు. అయినా కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. ఎన్నికలకు ముందు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ప్రత్యేక హోదా కావాలంటున్నారు. రేపు ఏమంటారో కూడా ఆయనకే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతోపొత్తు అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు. చంద్రబాబుది పూటకో మాట..గంటకో వేషం. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి. చంద్రబాబుకు దమ్ముంటే నిజం చెప్పాలి. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. చంద్రబాబు ఈ రోజు యూటర్న్‌ తీసుకుంది చంద్రబాబు వల్ల కాదా? నాన్న చెప్పేవారు..చంద్రబాబు తల మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు ఒక్క నిజం చెబుతారో ఆ రోజు చంద్రబాబు తల వెయ్యి ముక్కలవుతుందట. అందుకని చంద్రబాబు ఎప్పుడు నిజాలు మాట్లాడరు. 
  • పొత్తులు పెట్టుకునేది చంద్రబాబు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసింది చంద్రబాబు. ఇప్పుడేమో మాకు బీజేపీతో అంటూ ఆరోపిస్తున్నారు. మాకు కేసీఆర్‌తో పొత్తు అంటున్నారు. మొన్న నందమూరి హరికృష్ణ మృతదేహం పక్కనే చంద్రబాబు కేటీఆర్‌తో పొత్లుల గురించి మాట్లాడారు. మాకు ఎవరితోనూ పొత్తులు లేవు. మాకు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదు. ఆ అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైయస్‌ జగన్‌ సింగిల్‌గానే వస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ బంపర్‌ మెజారిటీతో గెలుస్తుందని దేశంలోని సర్వేలన్నీ చెబుతున్నాయి. నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి, జనసేన, మమతాబెనర్జి, దేవగౌడ, ఫరూక్‌ అబ్ధుల్లా, కేజ్రీవాల్‌ ఇలా ఎవరు తోడు వస్తే వారితో కలిసి వస్తున్నారు. 
  • ఐదేళ్లు మన రాష్ట్రాన్ని పాతాళంలోకి తోసేసి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని చంద్రబాబు మీ భవిష్యత్తు– నా బాధ్యత అని చెప్పుకుంటున్నారు ఈ దొంగ బాబు. నిన్న అజయ్‌ కల్లాం చంద్రబాబుతో కలిసి పనిచేశారు. నలభై ఏళ్లలో ఎంత అవినీతి జరిగి ఉంటుందో ..ఈ ఐదేళ్లలో చంద్రబాబు పాలనతో అంత అవినీతి జరిగిందని చెబుతున్నారు. నలభై ఏళ్లు ఏపీ ఎన్ని అప్పులు చేసిందో..ఈ ఐదేళ్లలో చంద్రబాబు అంతా అప్పు చేశారు. ఏ డబ్బంతా ఏమైనట్లు..తండ్రి కొడుకులు కలిసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఈ ఐదేళ్లు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? కేవలం పప్పుగారి బాధ్యత మాత్రమే చంద్రబాబుదా? ఈ ఐదేళ్లు పప్పు కోసమే పని చేశారు. అందుకే నిన్ను నమ్మం బాబు అని చెప్పండి. పొరపాటున మన భవిష్యత్తును వీరి చేతుల్లో పెడితే..నాశనం చేసేస్తారు. వీరు నారరూప రాక్షసులు. మన రాష్ట్రాన్ని మళ్లీ పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్తారు. 
  • రాబోయే రాజన్న రాజ్యంలో మీరు జగనన్నను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేస్తే..ప్రతి రైతుకు ప్రతి ఏటా మే నెలలోనే పెట్టుబడిసాయం కింద రూ.12500 ఇస్తారు. గిట్టుబాటు ధర కోసం రూ.3 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం. రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. కౌలు రైతులకు ఇవన్నీ వర్తింపజేస్తాం. 
  • డ్వాక్రా మహిళల రుణాలన్నీ నాలుగు దఫాల్లో మాఫీ చేసి నేరుగా మీ చేతుల్లోనే పెడతాం. మళ్లీ సున్నా వడ్డీ రుణాలు ఇప్పిస్తాం. పిల్లలను ఏమైనా చదివించండి..ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది. యువకులకు మళ్లీ ఉద్యోగాలు వస్తాయి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం కొత్త ఉద్యోగాలు విడుదల చేస్తాం. ప్రతి తల్లి తన బిడ్డలను స్కూల్‌కు పంపిస్తే చాలు ఆమె ఖాతాలో రూ.15 వేలు ప్రతి ఏటా జమా చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలకు రూ.75 వేలు ఆర్థికసాయం చేస్తాం. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్‌ రూ. 3 వేలు ఇస్తాం. ప్రతి విషయంలోనూ వికలాంగులను ఆదుకుంటాం. స్థానికంగా పైప్‌లైన్‌ వేసి ప్రతి వీధికి మంచినీటిని సరఫరా చేస్తాం. తాగునీటి సమస్య లేకుండా చేస్తామని వాగ్ధానం చేస్తున్నాం. ప్రతి విషయంలోనూ పేదవాడికి అండగా నిలబడే ప్రభుత్వం వస్తుంది. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రావాలి. అవినీతి లేని రాజ్యం కావాలంటే జగనన్న రావాలి. మాట తప్పని వాడు..మడమ తిప్పనివాడు కావాలంటే జగనన్న రావాలి. చెప్పింది..చెప్పనది చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలంటే జగన న్న రావాలి. పది నాలుక రావణాసురుడు పోవాలంటే జగనన్న రావాలి. కొడుక్కు మాత్రమే ఉద్యోగం ఇచ్చేవాడు పోవాలంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్లీ పండుగ కావాలంటే జగనన్న రావాలి. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి అనురాధమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి రాజేశ్వర్‌ను ఆశీర్వదించండి. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని వైయస్‌ షర్మిల విజ్ఞప్తి చేశారు.
     
Back to Top