మనసున్న వాడు ముఖ్యమంత్రి కావాలి

కొత్తపేట సభలో వైయస్‌ షర్మిల 

రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న రావాలి

చంద్రబాబుది రోజుకో మాట..పూటకో వేషం

జగనన్న సీఎం అయ్యాక ప్రతి రైతు రాజులా బతికే రోజు వస్తుంది

గిట్టుబాటు ధరల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి

ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోకుండా రూ.4 వేల కోట్లతో ప్రత్యేక నిధి

తూర్పుగోదావరి: మంచి చేయాలనే మనస్సున వాడు ముఖ్యమంత్రి కావాలని, రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న రావాలని వైయస్‌ షర్మిల  ఆకాంక్షించారు.   ఐదేళ్లుగా అధికారంలో ఉండి ఏమి చేయని చంద్రబాబు ఇప్పుడు ‘ మీ భవిష్యత్‌ – నా బాధ్యత’  అంటూ వస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? లోకేష్‌ భవిష్యత్‌ మాత్రమే చంద్రబాబు బాధ్యతా? అని నిలదీశౠరు.  బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా  కొత్తపేట నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.  

అప్పట్లో ప్రతి మహిళకు భరోసా..
 నియోజకవర్గప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజన్న రాజ్యం ఎలా ఉండేది? ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించే ఉండేది. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైయస్‌ఆర్‌ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిది. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు.  ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు. 

పప్పుగారికి జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు
నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి..బాబు వస్తే జాబు వస్తుందన్నారు. అన్నా..మీ కొడుక్కు జాబు వచ్చిందా? ఎవరికి వచ్చింది. చంద్రబాబు కొడుకు లోకేష్‌కుమాత్రమే వచ్చింది. ఏకంగా మూడు శాఖలకు మంత్రిగా కూర్చోబెట్టారు. ఈ పప్పుగారికి కనీసం జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదు. అ, ఆలు కూడా రావు కానీ అగ్రతాంబులం తనకే అంటారు. ఒక్క ఎన్నిక కూడా ఈ పప్పుగారు గెలవలేదు. ఏ అర్హత, అనుభవం ఉందని మూడు శాఖలకు మంత్రిని చేశారు చంద్రబాబు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు కొడుక్కేమో మూడు ఉద్యోగాలు..మాములు ప్రజలకు ఉద్యోగాలు లేవు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే ఉద్యోగాలు రావు. ఇలాంటి హోదాను చంద్రబాబు నీరుగార్చారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు హోదా సాధించలేకపోయారు. ఎన్నికలకు ముందు హోదా పదిహేనేళ్లు కావాలన్నారు. అధికారంలోకి వచ్చాక హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అంటారు. ఎన్నికలు అయిపోయిన తరువాత ఏమంటారో ఎవరికి తెలియదు.

దమ్ముంటే నిజం చెప్పాలి
చంద్రబాబు ఎప్పుడు మాట మీద నిలబడరు. ఎప్పుడు రెండు నాలుకల ధోరణి. చంద్రబాబుకు దమ్ముంటే నిజం చెప్పాలి. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటాలు చేశారు. చివరకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలతో రాజీనామా చేయించారు. ఈ రోజు చంద్రబాబు నోట ప్రత్యేక హోదా మాట వచ్చిందంటే అది వైయస్‌ జగన్‌ వల్ల కాదా? చంద్రబాబుకు నిజం చెప్పే దమ్ము లేదు. చంద్రబాబు నెత్తిన ఒక శాపం ఉందట. నాన్న చెప్పేవారు. ఏ రోజైతే చంద్రబాబు ఒక్క నిజం చెబుతారో ఆయన తల వెయ్యి ముక్కలవుతుందట. అందుకనే చంద్రబాబు ఎప్పుడు కూడా నిజం మాట్లాడరు. ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు మీ భవిష్యత్తు– నా బాధ్యత అంటున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ప్రజల బాధ్యత ఆయనది కాదా? కేవలం లోకేస్‌ బాధ్యత మాత్రమేనా? పొరపాటున మన బాధ్యత ఈయన చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారరూప రాక్షసులు వీరు. ప్రతి దాంట్లోనూ కమీషన్లు, అవినీతి, మాఫియానే. 

టీడీపీ నేతలను నిలదీయండి
ఎన్నికలు వస్తున్నాయి. టీడీపీ నేతలు మీ ఇంటికి వచ్చి మీ ఓటు అడుగుతారు. కేజీ నుంచి పీజీ వ రకు ఉచిత విద్య అని వాగ్ధానం చేశారు కదా? మా పిల్లల ఫీజు చంద్రబాబు బాకీ పడ్డారు కదా? ఆడపిల్ల పుడితే రూ.25 వేలు ఇస్తామన్నారు కాదా? ఆ బాకీ సంగతి ఏంటని నిలదీయండి. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్‌ ఇస్తామన్నారు. మహిళలకు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తామన్నారు. మీ హక్కుగా అడగండి. ఇంటికో ఉద్యోగం అన్నారు. నెలకు రూ.2 వేలు ఇస్తామన్నారు. ఐదేళ్లలో రూ.1.20 లక్షలు చంద్రబాబు బాకీ పడ్డారు. టీడీపీ నాయకులు వస్తే ముందు ఈ బాకీ సంగతి ఏంటని అడగండి. పేదలకు మూడు సెంట్ల స్థలం అన్నారు. విశాఖలో టీడీపీ నేతలు వేల ఎకరాలు దోచుకున్నారు.ఆ భూమంతా మీదే..అడిగి తీసుకోండి. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆ డబ్బులు  ఇవ్వమని అడగండి. మీ ఓటు అమ్ముతారా అని అడుగుతారు. అమ్ముడపోతారా? ఎన్ని డబ్బులు ఇచ్చినా చంద్రబాబు మీకున్న బాకీ తీర్చలేరు. ఈ అవినీతి పాలన పోవాలంటే జగనన్న రావాలి. కొడుక్కు మాత్రమే జాబు ఇచ్చిన వారు పోవాలంటే జగనన్న రావాలి. పది నాలుకల నాయకుడు పోవాలంటే జగనన్న రావాలి. మాట తప్పని వాడు..మడమ తిప్పని వారు కావాలంటే జగనన్న రావాలి. చెప్పిందే కాదు..చెప్పనిది కూడా కావాలంటే జగనన్న రావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో మీరు ఆశీర్వదించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయండి.

 ఆరోగ్య శ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రిలను చేరుస్తాం
ఈ నెల 11న ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు.  గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. 45 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి 75 వేల రూపాయిలు అందిస్తాం. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అనురాధమ్మ, కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా జగ్గిరెడ్డిని  జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. 
 

Back to Top