గుంటూరు జిల్లాలో వైయ‌స్‌ షర్మిల బస్సు యాత్ర

రాజన్న తనయకు అపూర్వ స్వాగతం

 గుంటూరు : వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయ‌స్‌ షర్మిల బస్సుయాత్ర ఆదివారం గుంటూరు జిల్లా నేమల్లె నుంచి ప్రారంభమైంది. పెదకూరపాడు చేరుకున్న రాజన్న తనయకు అపూర్వ స్వాగతం లభించింది. ఆమెను చూసేందుకు రోడ్లకు రెండువైపులా ప్రజలు బారులు తీరారు. ‘మీ రాజన్న బిడ్డను...జగనన్న చెల్లెను..మీ ముందుకొచ్చాను’ అంటూ ప్రజలకు అభివాదం చేస్తూ...వైయ‌స్‌ షర్మిల ముందుకు కదిలారు. మరోవైపు  పార్టీ కార్యకర్తలు,అభిమానులు ర్యాలీ నిర్వహించారు. 

గుంటూరు జిల్లా పెదకూరపాడు, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ప్రకాశం జిల్లా అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో షర్మిల ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ముందుగా పెదకూరపాడు,  మధ్యాహ్నం రొంపిచెర్లలో మహిళలతో వైయ‌స్‌ షర్మిల ముఖాముఖి నిర్వహించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top