తాడేపల్లి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. జిల్లాకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేద్దాం. పార్టీకి కోట్లాది మంది అభిమానులు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. పార్టీ ఒక పిలుపు ఇస్తే.. ఆ సమాచారం గ్రామ స్థాయి వరకు పోవాలి. ప్రతిపక్షంగా ప్రతి అంశంలోనూ గ్రామ స్థాయి నుంచి పోరాటం చేయాలి. అలాంటి వ్యవస్థను నిర్మించాలి. ప్రతి కార్యకర్తను, అభిమానిని ఈ నిర్మాణంలోకి తీసుకు రావాలి. మనందరం కలిసికట్టుగా పార్టీని మరింతగా పటిష్టం చేసుకుందామని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తాను మీ అందరి ప్రతినిధి మాత్రమే. పార్టీ కోసం కష్టపడే వారికి, ఆ ప్రక్రియలో నష్టపోయినవారికి పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.