స్పందన కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల వివరాలను అడిగి తెలుసుకొని, ఇప్పటి వరకు ఎన్ని అర్జీలకు పరిష్కారం చూపారని ఆరా తీశారు. అర్జీదారులకు నమ్మకం కలిగించాలని, పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Back to Top