పార్టీ ఆఫీసు మనందరిది

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

 

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రారంభించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం మనందరిది అంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శనివారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోని ప్రతి సభ్యుడు తన కుటుంబ సభ్యుడని ఆయన పేర్కొన్నారు. కార్యాలయం ప్రారంభోత్సవ ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ ఉదయం జరిగిన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభ వేడుకలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Back to Top