ఏకంగా నన్ను చంపించే ప్రయత్నం చేశారు

వినుకొండ సభలో వైయస్‌ జగన్‌

పక్కనే నాగార్జునసాగర్‌ ఉన్నా..తప్పని నీటి కష్టాలు

ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తూ డబ్బులు దోచేస్తున్నారు

చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమైపోయాయి

సీఈసీ ఆదేశాలను సైతం చంద్రబాబు బేఖాతరు చేస్తున్నారు

చంద్రబాబుకు మరోసారి ఓటేస్తే ఎవరిని బతకనియ్యరు

ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే..సామాన్యుల పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి 

గుంటూరు: చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికి రక్షణ లేదని, ఏకంగా ప్రతిపక్ష నేతగా ఉన్న తననే ఏకంగా చంపించే ప్రయత్నం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతకే రక్షణ లేని పాలనలో ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా వినుకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.  ఆయన ఏమన్నారంటే..

 • ఇదే నియోజకవర్గంలో పక్కనే సాగర్‌ ప్రాజెక్టు కనిపిస్తోంది. కానీ ఇక్కడ తాగడానికి నీరు ఉండదు. సాగునీరు లేదు. పక్కనే మాత్రం నాగార్జున సాగర్‌ కనిపిస్తోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎలాంటి దారుణంగా ఉందో చెప్పడానికి ఈ నియోజకవర్గమే ఒక ఉదాహరణ. ప్రజలకు ట్రాక్టర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ మున్సిపాలిటీలో నీళ్లు సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటూ ఈ సమస్యను సమస్యగానే వదిలిపెడుతున్నారు.
 • ఇదే నియోజకవర్గంలో ..ఇదే మున్సిపాలిటీలో పరిస్థితి ఏంటంటే..ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తూ..మరోవైపు మున్సిపాలిటీలో డబ్బులు కాజేస్తున్నారు. నీళ్లను వ్యాపారంగా మార్చారు. క్యాన్‌కు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. 
 • గంగాపల్లి మండలంలో తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. మరో ఊరిలో తాగునీటి ట్యాంకర్‌ వద్ద గొడవ పడి ఓ వ్యక్తి మరణించారు. ఈ నియోజకవర్గంలో తాగు, సాగునీరు లేదు. నీరిస్తానంటూ 1996లో వరికపుడిసిల ప్రాజెక్టుకు చంద్రబాబు ఒక టెంకాయ కొట్టారు. ఆ తరువాత మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన మాత్రం ఈ ప్రాజెక్టును ఎప్పుడు పట్టించుకోలేదు. మళ్లీ ఇవాళ ఎన్నికలు వచ్చేసరికి ఈ ప్రాజెక్టుకు టెంకాయకొట్టారు. 24 వేల ఎకరాలకు నీరు ఇస్తున్నట్లు బిల్డప్‌ కొడతారు. మరొవైపు పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి పులివెందులకు ఇస్తున్నానని చెబుతున్నారు. గుండ్లకమ్మ మీద 20 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. మంచినీరు దొరకడం లేదు.
 •  వినుకొండలో అవినీతి గురించి ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చారు. నీరు–చెట్టు అన్న పేరుతో దోచేస్తున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇదే నియోజకవర్గంలో గుండ్లకమ్మ నదిపై డ్యామ్‌లు కట్టాలని ప్రజలు అడుగుతున్నా..పట్టించుకునే దిక్కు లేదు.
 •  ఇదే నియోజకవర్గంలో ప్రధానమైన పంటలు మిర్చి, కంది, మినుము, వరి పరిస్థితి ఏంటని రైతులు మా వద్దకు వచ్చి చెబుతున్నారు.మిర్చి పంటకు జెమినీ వైరస్‌ వచ్చి దిగుబడి తగ్గింది.  చంద్రబాబు హయాంలో ఏ మాత్రం కూడా తోడ్పాటు లేదని రైతులు చెబుతున్నారు. మినుముకు కనీస మద్దతు ధర రూ.5500 ఉంటే, కనీసం రూ.4 వేలకు కొనుగోలు చేయడం లేదు. పత్తికి మద్దతు ధర లేదన్నా అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
 •  ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మనకు ఏం మేలు జరిగిందో ఒక్కసారి గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. చంద్రబాబు పాలన మీరంతా కూడా చూశారు. ఏ స్థాయిలో వ్యవస్థలను నాశనం చేశారో చూశాం. మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు చేశారు. 
 •  నిన్ననే మీరంతా చూశారు. రాష్ట్రంలో ప్రజల పాలన ఉందా? లేక చంద్రబాబు పెట్టుకున్న పోలీసుల పాలన ఉందా ఆలోచించండి. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తరువాత చంద్రబాబు తనకు కావాల్సిన అధికారులతో ఆర్డర్లు ఇచ్చుకుంటున్నారు. ఇంటలీజెన్సీ అధికారులు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని ఈసీ ఆ అధికారినిన పక్కన పెడితే..ఆ ఆర్డర్లను పక్కన పెట్టించిన ఘనుడు చంద్రబాబు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేశారు. మరొక్కమారు చంద్రబాబుకు ఓటు వేస్తే ఏ మనిషినైనా బతకనిస్తారా? ఆలోచన చేయండి.
 •  ప్రజల్లో ఉన్న తననే ఏకంగా చంపించడానికి ప్రయత్నించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో నాపై హత్యాయత్నం చేస్తే..గంటలోపే డీజీపీ వచ్చి ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోండి. బాబు స్క్రీప్ట్‌ ఇస్తే ఆ ప్రకారం డీజీపీ మాట్లాడుతున్నారు. బాబు కోసం సాక్షాత్తు ఎన్నికల కమిషన్‌ ఆర్డర్లు ఇచ్చినా కూడా ఆ ఆర్డర్లను పక్కనపెడుతున్నారు. ఇది మన రాష్ట్రంలో అత్యున్నత పరిపాలన. బాబు ఆర్డర్లతో పని చేసిన స్పీకర్‌ను చూశాం. ఎల్లోమీడియా కూడా ఇవాళ కనిపిస్తోంది. వ్యవస్థలను ఏ స్థాయిలో చంద్రబాబు నాశనం చేశారో ఈ పాలన చూడండి. 
 •  ప్రతిపక్ష నాయకుడికే రక్షణ లేని పాలనలో ..సామాన్యుల పరిస్థితి ఏంటి? మా సొంత చిన్నాన్నను హత్య చేయించి, ఆ నేరాన్ని మా కుటుంబ సభ్యులపై నెట్టేందుకు ఎల్లోమీడియాను వాడుకుంటున్న ఈ వ్యవస్థలో ఏమాత్రం రక్షణ ఉంటుందో ఆలోచించండి. ఆ కుట్రలు చూడండి. చంద్రబాబుకు మేలు చేసేలా విలువలేని ఒక యాక్టర్‌తో, ఒక పార్టనర్‌తో ఒక పార్టీ పెట్టించారు. కుట్రలో భాగంగా మరో పార్టీని పెట్టిస్తారు. ఆ పార్టీ గుర్తు, కండువా, చివరికి అభ్యర్థి పేరు కూడా వైయస్‌ఆర్‌సీపీ మాదిరిగా ఉండేలా పార్టీ పెట్టించారు. ఆ పార్టీ హెలికాప్టర్‌ గుర్తు ఎవరిదో మీకు తెలుసు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు కుట్రలు చూడండి. బాబుకు ఓటు వేస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా?
 •  చంద్రబాబు తన పరిపాలన మీద చర్చ జరుగకూడదని ఆలోచన. చర్చ జరిగితే ఈ ఐదేళ్లలో జరిగిన మోసాలు, అన్యాయాలపై ప్రజలు ఆలోచిస్తే..చంద్రబాబు అవుట్‌ అని ఆయనకు బాగా తెలుసు. ఆయన బినామీలు, ఎల్లోమీడియా  సంగతి అంతే అని తెలుసు. కాబట్టే చంద్రబాబు ప్రజలను తప్పుదోవపట్టించేందుకు, పాలనపై చర్చ జరుగకుండా పూటకో చర్చను లేవనెత్తుతున్నారు. ఆ కుట్రలో భాగంగా ఈ చివరి 14 రోజుల్లో చంద్రబాబు పరిపాలనలో రోజుకో కుట్ర కనిపిస్తోంది. రోజు అబద్ధాలు కనిపిస్తునాయి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ఎన్నికలు వచ్చేసరికి తారాస్థాయికి కుట్రలు తీసుకెళ్తారు
 • మీ అందరికి చెబుతున్న నేను ఉన్నాను   
 • ఫీజు రియంబర్స్‌మెంట్‌ రాక ఇంజనీరింగ్‌ చదవాలంటే ఫీజులు లక్షలు దాటుతున్న పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్‌ అరకొర మాత్రమే ఇస్తుంది. తల్లితండ్రులు ఆ పిల్లలను చదవుల కోసం ఆస్తులను అమ్ముకుంటున్న పరిస్థితని నా కళ్లారా చూశా.ప్రతి తల్లికి నేను చెబుతున్నా..నేను ఉన్నాను.108నెంబుర్‌కు ఫోన్‌ కొడితే కుయ్‌..కుయ్‌ అంటు 20నిమిషాల్లో అబుంలెన్స్‌ రాక ప్రాణాలు పొగొట్టుకున్న కుటుంబాలను చూశా. మందులకు డబ్బులు లేక అవస్థలు పడుతున్న కుటుంబాలను చూశా.అంతటి బాధలు పడుకుతన్న కూడా మనసు లేని ప్రభుత్వాన్ని చూశా. మీ కష్టాన్ని నేను చూశా. అంబులెన్స్‌ రాక ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి కుటుంబానికి చెబుతున్నానేను ఉన్నాను. మద్యం షాపులు ఎక్కువైపోయి మద్యానికే బాసిసలు అయి కుటుంబాలు నాశనం అవుతున్న పరిస్థితులు చూశా. ప్రతి గ్రామాల్లో మూడు నాలుగు బెల్టు షాపులు కనిపిస్తాయి. చంద్రబాబు పాలనలో గ్రామాల్లో ఉన్న ప్రతి దుకాణంలో మం‍దు దొరుకుతుంది. రాత్రి 7 దాటితే ఆడపిలల్లను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులను భయపడుతున్న పరిస్థితిని కనిపిస్తుంది. తాగుడుతో కుటుంబాలు నాశనం అవుతున్న పరిస్థితిని చూశా. ప్రతి అక్కాచెల్లికి చెబుతున్నా నేను ఉన్నాను. 
 • డబ్బులకు మోసపోవద్దు
 • ఎన్నికలు దగ్గరుకు వస్తే చంద్రబాబు రోజకో సినిమా చూపిస్తాడు. అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు చంద్రబాబు. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి.
 • ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నవాజ్‌, ఎంపీ అభ్యర్థి మిథున్‌లపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. ఎమ్మెల్యే అభ్యర్థిగా బ్రహ్మనాయుడు, ఎంపీగా   కృష్ణ‌దేవ‌రాయులు అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు 
Back to Top