అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా

పాడేరు సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

గిరిజన మెడికల్‌ కాలేజీ, యూనివర్సిటీ, ఇంజినీరింగ్‌ కాలేజీ తీసుకొస్తా

మీ భవిషత్తు..నా బాధ్యత అని బాబు కొత్త నాటకం

బాబు ఐదేళ్ల పాలనలో మోసాలు, దగాలు, అవినీతి, హత్యలే

రైతులు, పొదుపు సంఘాల మహిళలను చంద్రబాబు మోసం చేశారు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా మోసం చేశారు

నిరుద్యోగ భృతి ఇస్తామని వంచించారు

మద్యం అమ్మకాల్లో ఏపీని నంబర్‌వన్‌ చేశారు

మీడియా మేనేజ్‌మెంట్, వ్యవస్థలు మేనేజ్‌ చేయడంలో బాబే నంబర్‌వన్‌

మహిళలపై దాడుల్లో మన రాష్ట్రమే నెంబర్‌వన్‌

పొదుపు సంఘాల రుణాలు నాలుగు దఫాల్లో పూర్తిగా రద్దు చేస్తాం

చంద్రబాబు పంచే డబ్బుతో మోసపోవద్దు

 

విశాఖ: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తరువాత ప్రజలను  పట్టించుకునే నాథుడు కరువయ్యారని, అభివృద్ధి ఆగిపోయిందని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాన్న గారు అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేయడమే కాకుండా పరుగులు పెట్టిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పాడేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..

  •  దాదాపు 3648 కిలోమీటర్లు సాగింది పాదయాత్ర, దారి పొడవునా కష్టాలు విన్నాను, సమస్యలు చూశాను. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగాను అంటే దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు, దారి పొడవునా కష్టాలు, విన్నాను, సమస్యలు చూశాను. మరీ ముఖ్యమంత్రి ఎస్టీ నియోజకవర్గాల్లో గిరిజనుల కష్టాలను దగ్గరగా చూశాను. ఆ బాధలు చూశాను కాబట్టి, ఆ ఆవేదనను విన్నాను కాబట్టి మీ అందరికీ నేనున్నానని భరోసా ఇస్తున్నాను. నాన్నగారి హయాంలో మనం చూశాం. నాన్నగారి హయాం తరువాత, చనిపోయిన తరువాత ప్రజల గుండెల్లో ఉండాలని ఆరాటంతో పనిచేసేవారు కరువయ్యారు. నాన్నను ఆశీర్వదించారు. నాన్నకు తోడుగా ఉన్నారు. నాన్న చనిపోయిన తరువాత మీకు ఎవరూ లేరని అనుకోవద్దు. నాన్న పోతూ పోతూ మమ్మల్ని మీకు ఇచ్చిపోయారు. ఇంత పెద్ద కుటుంబం నీకు తోడుగా ఉంటుందని, గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. ఆప్యాయత చూపించారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత అందరికన్నా ఎక్కువగా బాగుపడేది పేదవాడు. ఎస్సీ, ఎస్టీలు పేదరికంలో ఏ స్థాయిలో ఉన్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో అంతగా గుండెల్లో పెట్టుకొని అన్నింటిని పక్కన బెట్టి భుజాన ఎత్తుకున్నారు నన్ను. నాన్నగారి హయాం మీకు, నాకు బాగా గుర్తుంది. దాదాపు 7 లక్షల ఎకరాలు ఎస్సీ, ఎస్టీలకు పంచారు. దాని తరువాత ఆ దిశగా ఏ ప్రభుత్వం అడుగులు వేయని పరిస్థితి చూస్తున్నాం. ఆ దిశగా అడుగులు వేయడమే కాదు.. పరుగులు పెట్టిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.. 
  • ఈ ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలన చూశాం. ట్రైబల్‌ అడ్వయిజరీ కమిటీ నియమించడం చట్ట ప్రకారం చేయాలి. అటువంటి కమిటీ విషయంలో ఈ ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తించిందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గిరిజన ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఆరు మంది వైయస్‌ఆర్‌ సీపీ నుంచి గెలిచారని ఏరకంగా కక్ష సాధించారో వేరే చెప్పాల్సిన పనిలేదు. అటువంటి పరిస్థితులు మీరు పడిన కష్టాలు చూశాను. సమస్యలు విన్నాను. మన ప్రభుత్వం అని మీ అందరి నోటి నుంచి వచ్చేలా గొప్ప పాలన చేస్తా. బ్యాక్‌లాక్‌ పోస్టులు భర్తీ కావు. 500 పైచిలుకు జనాభా ఉన్న తండాలు పంచాయతీలు కావడం లేదు. ప్రతీ విషయంలో వెనకబడే ఉన్నాం. ఈ పరిస్థితులు మారుతాయని హామీ ఇస్తున్నాను. 
  • ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ మన ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు నెలల్లో శంకుస్థాపనలు చేసి ఆస్పత్రులు కట్టిస్తాం. గిరిజన ప్రాంతం అంతా ప్రత్యేక జిల్లా చేస్తాం. ఆ జిల్లాలో మెడికల్‌ కాలేజీ, గిరిజన యూనివర్సిటీ, ఇంజనీరింగ్‌ కాలేజీ తీసుకొస్తా. బాక్సైట్‌ మైనింగ్‌ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసినా అది ఆగిపోయిందంటే దానికి కారణం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోరాటాలు. ఇదే నియోజకవర్గానికి చెందిన గిడ్డి ఈశ్వరి అన్న మాటలు మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటాయి. చంద్రబాబును ఉద్దేశించి బాక్సైట్‌ మైనింగ్‌లో ఏరకంగా అన్యాయం చేస్తున్నారని గిరిజన ప్రాంతానికి చెందిన అప్పటి వైయస్‌ఆర్‌ సీపీ గిడ్డి ఈశ్వరి, ఇప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏమేం మాటలు మాట్లాడిందో నేను వేరే చెప్పాల్సిన పనిలేదు. పూర్తిగా కట్టుబడి ఉన్నాను. బాక్సైట్‌ తవ్వకం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. 
  • ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనపై ఆలోచన చేయాలి. 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మనం వేసే ఓటు ఎవరికి వేయాలని గుండెలపై చేయి వేసుకొని ఎటువంటి కావాలనే ఆలోచన చేయడం మర్చిపోవద్దు. మీరంతా సినిమాలు చూస్తారనుకుంటున్నా.. ఈ మధ్య కాలంలో మహానాయకుడు అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్‌ చూశారా.. ఆయన పేరు దొంగ అల్లుడు. చేయనిది చేసినట్లుగా.. చేసింది చేయనట్లుగా ఆయన ఈ మధ్య కాలంలో టీవీల్లో అడ్వటైజింగ్‌లు ఇస్తున్నాడు. ఆయన గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆయన పేరు మీకు తెలుసు. ఆయన గుణగణాల గురించి ఒక్క లైన్‌ చెబితే డౌట్‌ కూడా ఉండదు. సొంత కూతురును ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరో చెప్పాల్సిన పనిలేదు. ఐదేళ్ల పాలనలో అవినీతిని చూశాం. హత్యలు చూశాం. దుర్మార్గాలు చూశాం. మోసం చూశాం. కానీ చెప్పేమాటలు మాత్రం ధర్మరాజుకు ధర్మం చేయడం తానే నేర్పినట్లు, హరిశ్చంద్రుడికి సత్యం పలకడం తానే చెప్పినట్లుగా బిల్డప్‌ ఇస్తాడు. మాటలు చూస్తే ఆ స్థాయిలో అబద్ధాలు చెప్పగలుగుతాడు. మీడియాను మేనేజ్‌ చేయడంలో ఆయన్ను మించిన వ్యక్తే ఉండడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తోనే కాకుండా అమ్ముడుపోయిన టీవీచానళ్లతో యుద్ధం చెస్తున్నాం. ఇవాళ యుద్ధం ఆ స్థాయిలో జరుగుతుంది. 
  • ఐదు సంవత్సరాలు అందరిని మోసం చేసిన నోట్లో నుంచి వచ్చే పదం మీ భవిష్యత్తు నా బాధ్యత అని అంటున్నాడు.. నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా.. ? ఐదు సంవత్సరాలు మన ఖర్మ కొద్ది మన జీవితాలు ఆయన చేతుల్లో పెడితే బాగుపడ్డాయా..? ఇటువంటి వ్యక్తి మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు. రాష్ట్రానికి ఇంత అన్యాయమైన పాలన చేసిన ఈ వ్యక్తి రాష్ట్రానికి ఐదేళ్లలో 650 అవార్డులు వచ్చాయని, నంబర్‌గా చేశానని చెబుతున్నాడు. రాష్ట్రాన్ని చంద్రబాబు రుణమాఫీ ఎగ్గొట్టడంలో నంబర్‌ చేశాడు. పొదుపు సంఘాలు రుణాలు మాఫీ చేస్తానని నంబర్‌ వన్‌ మోసం చేశాడు. అంతేకాదు ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఉద్యోగం వచ్చే వరకు రూ. 2 వేల భృతి అన్నాడు. ఐదేళ్ల తరువాత ఆయన చేసిందేమిటంటే పిల్లలను కూడా వదల కుండా మోసం చేసి రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశాడు. పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా పిల్లలు చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య చెప్పిస్తానని మోసం చేసి రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశాడు. మొదటి సంతకంతో బెల్టుషాపులు రద్దు అన్నాడు.. కానీ ఇవాళ గ్రామంలో చూస్తే ఒకటి కాదు.. నాలుగు ఐదు కనిపించేలా రాష్ట్రాన్ని తాగుడు ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత చంద్రబాబుదే.. దాంట్లో చంద్రబాబుకు నెంబర్‌ వన్‌ స్థానం ఇవ్వాలి. 
  • ఆరోగ్యశ్రీ అమలు చేయకపోవడంలో, ఆపరేషన్‌ కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తీసుకురావడంలో, 108కు ఫోన్‌ కొడితే కుయ్‌.. కుయ్‌ అంటూ రావాల్సిన అంబులెన్స్‌ రాకపోవడంలో మాత్రం రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా చేశాడు చంద్రబాబు. సీపీఎస్‌ ఉద్యోగులు ఐదు సంవత్సరాలుగా రద్దు చేయండి.. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయండి అడిగినా.. వారిని గాలికి వదిలేసి నంబర్‌ వన్‌ చేశాడు. మద్యం అమ్మకాల్లో, పెట్రో, డీజిల్‌ రేట్లు మన రాష్ట్రంలో అత్యధిక రేట్లలో అమ్మడంలో, రైతుల ఆత్మహత్యల్లో, కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల్లో నంబర్, స్కూల్‌ ఫీజులు పెంచడంలో, మహిళలపై నేరాలు చేసిన మంత్రుల్లో అత్యధిక మంత్రులు మన రాష్ట్రంలోనే ఉన్నారు. 22 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి శాసనసభను దుశ్యాసన సభగా మార్చడంలో, ప్రతిపక్ష నాయకులను చంపించడంలో, ప్రతిపక్షంలో కేసులు పెట్టడంలో, టీడీపీ నేతలపై కేసులు ఎత్తేస్తూ జీఓలు ఇవ్వడంలో, దేవుడి భూములు మింగడంలో, ఓటుకు కోట్లు ఇస్తూ దొరికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి రాజీపడడంలో, ఏపీ ఆస్తులను వదులుకోవడంలో, ప్రత్యేక హోదాను అడిగితే కేసులు పెట్టడంలో, ప్రత్యేక హోదాను వదులుకోవడంలో, భూదందాల్లో, ఆక్రమణల్లో, కుంభకోణాల్లో, ఇసుక, మట్టి, బొగ్గు, కాంట్రాక్టర్లు, కరెంటు కొనుగోలు, రాజధాని, విశాఖ, దళితుల భూములు దోచేయడంలో చంద్రబాబుకు నంబర్‌ వన్‌ స్థానాన్ని ఇవ్వాలి. 
  • గ్రామాల్లో చంద్రబాబు జన్మభూమి కమిటీల మాఫియాను తయారు చేశారు. పెన్షన్, రేషన్, చివరకు మురుగుదొడ్లు మంజూరు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి. మొదట ఏ పార్టీ అని అడుగుతున్నారు. లంచాలు లేనిది ఒక్క అడుగు ముందుకుపడని పరిస్థితి. మీడియా మేనేజ్‌మెంట్, వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు నంబర్‌ వన్‌. ఇన్ని అన్యాయాలు, అబద్ధాలు, మోసాలు చేస్తూ ఇంత దారుణమైన పాలన ఇస్తూ ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు. ఇలాంటి పాలన మనకు అవసరమా..? 
  • ‘తల్లికి అన్నం పెట్టనివాడ అవసరం వచ్చినప్పుడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానన్నాడట’ చంద్రబాబును చూస్తే అలాగే అనిపిస్తుంది. ‘సర్పంచ్‌ ఎన్నికల్లో మీరంతా ఒక వ్యక్తిని గెలిపిస్తాడు. ఐదేళ్లు అతను మిమ్మల్ని వదిలేసి ఐదేళ్లు పూర్తయిన తరువాత మళ్లీ పోటీకి దిగి 2022 వచ్చే సరికి ఇంటింటికి మంచినీరు ఇస్తా.. 2029 నాటికి వీధి వీధికి సిమెంట్‌ రోడ్లు చేస్తా.. 2050 వచ్చే సరికి ఆయన ఉంటాడో లేడో తెలియదు.. మన గ్రామాన్ని జిల్లాలోనే నంబర్‌ వన్‌గా చేస్తానంటాడు’ ఐదేళ్లు మేలు చేయని సర్పంచ్‌ ఆ తరువాత ఎన్నికలు వచ్చే సరికి ఈ మాదిరిగా చెబితే ఏమంటారని అడుగుతున్నా.. మోసగాడు అని అంటారా లేదా.. మరి ఇవాళ చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయాలి. 2014 నుంచి 2019 ఐదు సంవత్సరాల్లో తన పాలన చూపించి ఓట్లు వేయమని అడగడం లేదు.. మీ భవిష్యత్తు నా బాధ్యత అని అంటున్నాడు.. ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేస్తారా.. 
  • ఈ పెద్ద మనిషి మోసపూరిత పాలన చేస్తున్నాడు కాబట్టే ఎన్నికలు వస్తున్నాయని మీ ప్రతిగ్రామానికి డబ్బులు పంపిస్తాడు. మీ గ్రామాలకు డబ్బులు పంపించి చేతుల్లో రూ. 3 వేలు పెట్టి కొనుగోలు చేయాలని చూస్తాడు. మీ అందరినీ ఒకటే అడుగుతున్నా బాబు పాలన చూడండి. ఈ వ్యవస్థలో విశ్వసనీయత, విలువలు అనే పదాలకు అర్థం రావాలి. మీరంతా మీ గ్రామాలకు వెళ్లండి మీ గ్రామాల్లో ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అన్నను కలవండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం అన్న వచ్చిన తరువాత మన పిల్లలను బడులకు పంపిస్తే చాలు అన్న సంవత్సరానికి రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా 20 రోజులు ఓపిక పట్టండి అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. చంద్రబాబు మోసానికి మరోసారి బలికావొద్దు అక్కా.. అన్న ముఖ్యమంత్రి అయితే మన పిల్లల చదువుకు ఎన్ని లక్షలు అయినా పర్వాలేదు చదివిస్తాడని చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చెప్పండి రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశాడు. సున్నా వడ్డీ అనే పథకం లేకుండా పోయింది. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఉన్న అప్పంతా నాలుగు దఫాల్లో నేరుగా అన్న ఇస్తాడని చెప్పండి . 45 నుంచి 65 సంవత్సరాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్క. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొస్తున్నాడు. ప్రతి అక్క చేతుల్లో అన్న రూ. 75 వేలు పెడతాడు నాలుగు దఫాల్లో అని చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి రుణాలు మాఫీ అని మోసం చేసిన చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దు, సున్నా వడ్డీ లేదు, గిట్టుబాటు ధర లేదు. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం మే మాసంలోనే ప్రతి రైతన్న చేతులో రూ. 12500 అన్న ఇస్తాడని చెప్పండి. ప్రతి అవ్వ, ప్రతి తాత దగ్గరకు వెళ్లి అడగండి మూడు నెలల కిందట చంద్రబాబు పెన్షన్‌ ఎంత ఇచ్చేవాడని అడగండి.. వెయ్యి మాత్రమే అని చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తాడని చెప్పకపోయి ఉంటే చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడేనా అని అవ్వాతాతలను అడగండి. చంద్రబాబు మోసాలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టండి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పెన్షన్‌ రూ. 3 వేలు పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వాతతకు చెప్పండి. 
  • నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి ఇంటికి చేరాలి. నవరత్నాలతో జీవితాలు బాగుపడతాయని సంపూర్ణంగా నమ్ముతున్నా. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, విలువలు తీసుకువచ్చే ఈ ప్రయత్నంలో మీ అందరి చల్లని ఆశీస్సులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇవ్వాలని, భాగ్యలక్ష్మమ్మ నా చెల్లెలు లాంటిది మీ అందరి ఆశీస్సులు అందించాలి. మాధవమ్మ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి మీ చల్లని దీవెనలు చెల్లెలిపై ఉంచాలని పేరు పేరున ప్రార్థిస్తున్నా.. ఇంతకు ముందు మన పార్టీ కోఆర్డినేటర్‌గా ఉన్న విశ్వేశ్వర్‌రాజుకు టికెట్‌ ఇవ్వలేకపోయాను. అందుకు బాధపడుతున్నాను.. తనకు అన్యాయం జరగనివ్వను.. అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తాను. చిరునవ్వులు చూసేలా మాటిస్తున్నా.. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు వైయస్‌ఆర్‌ సీపీపై చూపాలని, మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. 
Back to Top