గుంటూరు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారీ వైద్య పథకం ప్రకటించారు. మనందరి ప్రభుత్వం రాగానే రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి యూనివర్సల్ హెల్త్‌కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. నెలకు రూ.40 వేలు జీతం ఉన్న వారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తామని మాట ఇచ్చారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తామని, స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే పర్యవేక్షణ కమిటీ ఉంటుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఇదే గుంటూరు సిటీ నా పాదయాత్ర సందర్భంగా కూడా ఇక్కడి నుంచి ప్రయాణంస ఆగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లు తవ్వారు.. పూడ్చకుండా వదిలేశారు. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు నగరానికి ఏం చేయలేని వ్యక్తి రేపే ఏదో చేస్తానంటే నమ్మగలమా.. గుంటూరు నగరంలో డ్రైనేజీ సరిగ్గా లేకపోవడంతో పైపులైన్‌లోకి మురుగునీరు వచ్చి నీరు కలుషమితమైపోయి డయేరియా వచ్చి ఏకంగా 30 మంది చనిపోలేదా చంద్రబాబూ.. వందల మంది ఆస్పత్రుల పాలయ్యారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే చంద్రబాబు నివాసం ఉంది. ప్రతిపక్షంగా మనం ఆందోళన చేస్తే తప్ప చంద్రబాబు మనుషులు చనిపోయారని ఒప్పుకోలేదని, ప్రతిపక్షం ధర్నా చేస్తే 32 మంది చనిపోతే 8 మంది చనిపోయారని ధ్రువీకరించారు. పరిహారం ఇచ్చి ఆ మిగిలిన వారిని పూర్తిగా ఎగ్గొట్టే కార్యక్రమం చేశారు. కానీ ఇవాల్టికి ఆ దెబ్బతిన్న పైపులను మార్చలేదంటే ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉందనడానికి వేరే ఉదాహరణ అవసరం లేదు. తాగునీటి కోసం ఇప్పటికీ సమస్యే. శివారు కాలనీల్లో రెండ్రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి రూ. 365 కోట్లు 2013లోనే గత ప్రభుత్వం కేటాయించింది. ఆ పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయంటే.. ప్రజల మీద వీళ్లకు ఏ మేరకు ధ్యాస, ఆలోచన ఉందో ఇంతకంటే నిదర్శనం అవసరమా..? ఇదే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికిలో సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో మీరంతా చూశారు.. ఆపరేషన్ థియేటర్లలో లైట్లు లేక జనరేటర్లు సరిగ్గా పనిచేయక సెల్‌ఫోన్లలో లైట్ ఆన్ చేసుకొని ఆ వెలుగులతో ఆపరేషన్లు చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఉంటుందా.. ఇదే ప్రభుత్వ ఆస్పత్రిలో పది రోజుల వయస్సున్న శిశువు ఎలుకలు కొరికి చనిపోయింది. ఒక్కసారి మీరంతా ఆలోచన చేయండి. చంద్రబాబు కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం. అందులో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గొప్ప ముఖ్యమంత్రిని చూశాం. కానీ, ఏ ఒక్క ముఖ్యమంత్రి హయాంలోనైనా ఎలుకలు కొరికి చిన్న పిల్లలు చనిపోయిన సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా.. అని అడుగుతున్నా.. అంతటి దారుణంగా కావాలని వీళ్లే ఎలుకలను పంపించి చిన్న పిల్లలను సైతం బలిగొని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్వీసులు బాగుండడం లేదని ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలనే సంకేతాలు ఇస్తున్నాడు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నుంచి తప్పించాడు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆస్పత్రులకు 8 నెలల బకాయిలు పెట్టాడు. ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ పాఠశాలలు, ఆస్పత్రులను అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నాడు. ప్రజలంతా ప్రైవేట్ రంగాలకు వెళ్లేందుకు దగ్గరుండి పథకం ప్రకారం చేస్తున్నాడు. గుంటూరు శివారులోని అడవితెక్కెరపాడులో పేదవాడికి సంబంధించిన అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడమే కాకుండా పేదవాడి జీవితాలతో స్కామ్ చేస్తూ ప్లాట్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. 300 అడుగుల లిఫ్టు, గ్రనైట్ లేని ఇల్లు కట్టేందుకు అడుక్కు రూ. వెయ్యి దాటదని ఎవరైనా చెబుతారు. అడుగుకు రూ. వెయ్యి చొప్పున రూ. 3 లక్షలకు ఇవ్వాల్సిన ప్లాటు రూ. 2 వేల చొప్పున రూ. 6 లక్షలకు విక్రయిస్తున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 3 లక్షలు ఇస్తే మిగిలిన రూ. 3 లక్షలు మాత్రం పేదవాడి పేరు మీద అప్పుగా రాసుకుంటారంట. ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెలకు రూ. 3 వేలు కడుతూ పోవాలంట. చంద్రబాబు తీసుకున్న లంచాలకు పేదవాడు డబ్బు కట్టాలంట. ఎన్నికలు వస్తున్నాయని ప్లాట్లు కూడా ఇస్తున్నారు. చంద్రబాబు ఫ్లాట్లు ఇస్తే ఎవరూ వద్దూ అనొద్దు తీసుకోండి. ఆ తరువాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీ అందరికీ మాటిస్తున్నాను.. జగన్ అనే నేను.. ఆ ఫ్లాట్ల మీద రూ. 3 లక్షల రుణాలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని మాఫీ చేస్తానని మాటిస్తున్నా. ఇలాంటి మోసపూరిత పాలన మధ్య నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర ప్రతి ఊర్లో నుంచి జరిగింది. ప్రతి పేదవాడు పడుతున్న బాధలు విన్నా.. గుంటూరు, విజయవాడ వంటి నగరాలకు వచ్చినప్పుడు మధ్య తరగతి వారు పడుతున్న బాధలు కూడా విన్నా. అన్నా.. మా పరిస్థితీ అంతే దారుణంగా ఉంది. బతకలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పిన బాధలు విన్నా.. వాళ్లకు కూడా మంచి ఎలా చేయాలని ఆలోచించా.. నగరంలో ఉన్నవారికి ప్రధాన ఉండే సమస్యలు ఏంటని ఆలోచన సాగింది. ప్రధానంగా నగరంలో ఉన్న వారికి రెండు మూడు సమస్యలు కనిపిస్తాయి. అందులో ఒకటి తమ పిల్లలను చదివించడం కోసం ఫీజులు చూస్తే ప్రైవేట్ రంగంలో ఉన్న స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు చూస్తే ఎల్‌కేజీ చదివించాలన్నా.. సంవత్సరానికి రూ. 25 వేలు గంజుతున్నారు. స్కూళ్లలో, కాలేజీల్లో ఫీజులు బాదుడే బాదుడు. ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్న సాయం అరకొరగా వస్తున్న పరిస్థితుల్లో చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకుంటే తప్ప చదువు దొరకడం లేదు. అంతో ఇంతో జీతాలు వస్తుంటాయి. ఆ జీతాలతో ఉన్న వాళ్లకు కూడా హఠాత్తుగా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే.. ఆస్పత్రులకు వెళ్తే వారు వేసే బిల్లులకు జీతాలు సరిపోవడం లేదు. అప్పులు కూడా ఒకేసారి బాదుడే.. బాదుడు అన్నట్లుగా తయారవుతున్నాయి. చదువులు అయిపోయాయి. ఉద్యోగాలు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితులు నా కళ్లతో నేను చూశా.. ఆ ప్రతి బాధ నేను విన్నా.. మీ అందరికీ చెబుతున్నాను మీ అందరినీ నేను ఉన్నానని మాట ఇస్తున్నా.. మొదటి సారిగా చదువులకు సంబంధించి పాదయాత్రలో ఒకసారి చెప్పాను. చదువుల ఫీజులు ఎక్కువైపోయి పూర్తిగా గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఆ స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే స్థితి తీసుకువచ్చారు. గవర్నమెంట్ స్కూళ్లలో సమయానికి పుస్తకాలు కూడా సరఫరా చేయరు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నీరుగారుస్తూ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విధంగా చేస్తున్నారు. ఆ ప్రైవేట్ స్కూళ్ల పేర్లు నారాయణ, చైతన్య అని వినిపిస్తుంటాయి. ఆ నారాయణ అనే స్కూళ్లు చంద్రబాబు బినామీలు. ఆ స్కూళ్లు గ్రామాల్లో కూడా వ్యాపించేలా కృషి చేస్తున్నాడు చంద్రబాబు. ఎల్‌కేజీకి రూ. 25 వేలు గుంజుతున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తామని హామీ ఇస్తున్నా.. పేదరికం, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి కుటుంబాలందరికీ హామీ ఇస్తున్నా.. అధికారంలోకి వచ్చిన కాలేజీ ఫీజులు, స్కూళ్లు ఫీజులు పూర్తిగా రెగ్యులేట్ చేసే విధంగా రెగ్యులేటరీ కమిషన్ తీసుకువస్తాను.. ఆ కమిషన్ ముఖ్యమంత్రికే రిపోర్టు చేసే విధంగా కమిషన్‌కు బాధ్యతలు అప్పగిస్తాను. అధికారంలోకి వచ్చిన తరువాత తగ్గించిన ఫీజులు ఇవీ అని చూపిస్తాను. ఫీజులు తగ్గించడమే కాదు.. ఆ స్కూళ్లు, కాలేజీల్లో వసతులు కూడా పెరిగే విధంగా రెగ్యులేటరీ కమిషన్ ద్వారా నేనే దగ్గరుండి పర్యవేక్షిస్తానని మాటిస్తున్నా.. పేదరికంలో ఉన్నవాడి పరిస్థితి లాగే నగరంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారి పరిస్థితి తయారైంది. ఒక్కసారి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ వైద్యం దెబ్బకు ఉన్న ఆస్తులు అమ్ముకునే స్థితిలోకి ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. ఆ పరిస్థితిని మార్చే కార్యక్రమం చేస్తున్నా.. సమస్యల గురించి ఆలోచనలు చేసుకుంటూ వచ్చా.. ఆరోగ్యశ్రీ పేదవాడికే పరిమితం చేస్తే మధ్య తరగతి జీవితాలు అదే మాదిరిగా ఉన్నాయి. వీళ్ల జీవితాలు ఎలా మెరుగు పరచాలని ఆలోచనలు పరిగెత్తాయి. ఆ ఆలోచనల నుంచి మీ అందరికీ హామీ ఇస్తున్న దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదవాడి దగ్గర నుంచి అక్షరాల సంవత్సరానికి రూ. 5 లక్షలు అంటే నెలకు రూ. 40 వేలు జీతం ఉన్నవారికి కూడా యూనివర్సల్ హెల్త్ కార్డు తీసుకువస్తాను. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు వాళ్లందరికీ యూనివర్సల్ హెల్త్ కార్డుతో ఆరోగ్యశ్రీలోకి తీసుకువస్తానని హామీ ఇస్తున్నా. ఈ పథకం నేరుగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ అనే నేనే దగ్గరుండి పర్యవేక్షిస్తాను. పరిస్థితులు పూర్తిగా మారుస్తా.. ఉద్యోగాలకు సంబంధించిన పరిస్థితులపై చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చా. అక్షరాల గవర్నమెంట్‌లో ఖాళీగా 2.30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. పాలకులు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.30 ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో చదువుకున్న మీ పిల్లలకు 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చా. ప్రతి 50 ఇళ్లకు గ్రామ వలంటీర్‌గా తీసుకుంటూ గౌరవ వేతనం రూ. 5 వేలు ఇస్తూ 50 ఇళ్లకు సంబంధించిన ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన విషయం కూడా నేరుగా వలంటీర్ గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై ప్రతి పేదవాడు ఇంటికి వెళ్లి ఆ గ్రామ వలంటీర్ ప్రతి పథకం డోర్ డెలవరీ అయ్యేట్లుగా చేస్తాడని హామీ ఇచ్చా. ఉద్యోగాలకు సంబంధించి పరిశ్రమల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా మొట్ట మొదటి శాసనసభలోనే ఒక తీర్మానం చేస్తామని 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం తెస్తామని ఇప్పటికే ప్రకటించాం. గవర్నమెంట్ కాంట్రాక్టులు బస్సులు, కార్లు అద్దెకు తీసుకోవడం దగ్గర నుంచి లాభదాయకంగా ఉన్న ప్రతి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇక మీదట జేసీ బ్రదర్స్, కేశినేని ట్రావెల్స్‌కు కాకుండా నిరుద్యోగ యువతకే అందజేస్తామని హామీ ఇచ్చా. దాని కోసం యువతకు సబ్సిడీ కూడా వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చా. అందులో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ వచ్చేలా చేస్తానని మాటిచ్చా. ప్రత్యేక హోదా సాధించుకొని హోదా ద్వారా వందశాతం ఇన్‌కం ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. జీఎస్టీ కట్టాల్సిన పనిలేదు. ఈ రెండూ వస్తే పరిశ్రమలు, ఆస్పత్రులు, హోటళ్లు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నగరం హైదరాబాద్‌ను మించిన నగరంగా తయారవుతుంది. మీరంతా నవరత్నాలను ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి అన్న దగ్గరకు తీసుకెళ్లండి. నవరత్నాల ద్వారా ప్రతి జీవితం బాగుపడుతుంది. ప్రతి ఇంట్లో వెలుగులు వస్తాయని సంపూర్ణంగా నమ్ముతున్నా.. నవరత్నాల గురించి జరిగే మంచి గురించి చెప్పండి. ఎన్నికల వేల చంద్రబాబు ప్రతి గ్రామానికి మూటల మూటల డబ్బులు పంపించి ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టి ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాడు. ప్రతి అక్కను కలవండి అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం అని చెప్పండి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే పిల్లలను బడికి పంపిస్తే అన్న సంవత్సరానికి రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. ప్రతి కుటుంబానికి నవరత్నాల గురించి వివరిచండి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలని కోరుతున్నారు. విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకురావాలని కోరుతూ.. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న.. మస్తఫా అన్నకు అందించాలి. ఎందరో ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు కానీ ముస్తఫా అన్న మాత్రం నిజాయితీగా నిలబడ్డాడు. మంచివాడు, సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ముస్తఫా అన్నపై ఉంచాలి. అదే మాదిరిగా యేసురత్నం అన్నను గెలిపించండి. ఐజీగా మంచి పోలీసులు అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. ఎంపీ అభ్యర్థిగా వేణు అన్న ఉన్నాడు.. మంచిచేస్తాడని నమ్ముతున్నాను. వీరిని గెలిపించాలని పేరు పేరునా కోరుతున్నా..