సావిత్రి బాయి పూలే సేవ‌ల‌ను స్మ‌రించుకుందాం

సావిత్రిబాయి జయంతి సందర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు 

తాడేప‌ల్లి: ప్రముఖ సంఘ సేవకురాలు, భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే పోరాటాల‌ను, ఆమె సేవ‌ల‌ను స్మ‌రించుకుందామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. సావిత్రిబాయి పూలే జ‌యంతి సంద‌ర్భంగా అమెకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. .

విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి, బాలికా విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలేగారు. నేడు ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకుంటూ సావిత్రిబాయిగారి జయంతి సందర్భంగా నివాళులు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్విట్ట‌ర్‌లో సందేశాన్ని పోస్టు చేశారు.

Back to Top