అప్పుడే మోదీతో కలువలేదు..ఇప్పుడు కలుస్తానా?

కర్నూలు సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

పాదయాత్రలో మీ కష్టాలు చూశా..మీ బాధలు విన్నా

రైతన్నలు పడే ఆవేదన చూశా..పేద ప్రజల గుండె చప్పుడు విన్నా..

మీ అందరికీ నేనున్నాననే భరోసా ఇస్తున్నా

చంద్రబాబు ప్రలోభాలకు మీరు మోసపోవద్దు

రెండు రోజులు ఓపిక పట్టండి..జగనన్న వస్తాడని చెప్పండి

ప్రత్యేక హోదాకు సంతకం పెట్టిన వాళ్లకే మా మద్దతు 

 

కర్నూలు: 2014 ఎన్నికలకు ముందు దేశంలో నరేంద్రమోదీ ప్రభంజనం ఉండేదని, అప్పట్లోనే మోదీతో కలువలేదు..ఇప్పుడు వైయస్‌ఆర్‌సీపీ ప్ర¿¶ ంజనం ఉంది..ఇలాంటి సమయంలో కలుస్తానా అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీతో ఎలాంటి పొత్తు లేదని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక మోదా ఇచ్చిన వారికే వైయస్‌ఆర్‌సీపీ మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఎవరైనా సరే నన్ను దాటిన తరువాతే మీ వద్దకు వస్తారని ధైర్యం చెప్పారు. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

  • నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో పూర్తి చేయగలిగాను. నా పాదయాత్రలో ప్రతి రైతు పడుతున్న ఆవేదన చూశాను. ప్రతి పేద, మధ్య తరగతి ప్రజలు అనుభవిస్తున్న గుండె చప్పుడు విన్నాను. వారు పడుతున్న కష్టాలు చూశాను. వారి ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు నవరత్నాలు ప్రకటించాను. 
  • ఈ రోజు ఐదేళ్ల చంద్రబాబు దుష్టపరిపాలనకు ముగింపు పలికేందుకు చివరి ఘడియలు వచ్చాయి. మరో 36 గంటల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. చంద్రబాబు మోసాలు చూసిన తరువాత ఈ మోసాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఓటు వేయబోతున్నారు. చంద్రబాబు పాలన చూశారు. మోసాలు, కుట్రలు చూశారు. చంద్రబాబు ఏం చేస్తున్నారో మీ అందరికి తెలిసిందే. ప్రతి వార్డుకు చంద్రబాబు మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు డబ్బు పెట్టే కార్యక్రమం చేస్తారు. మీరంతా కూడా ప్రతి వార్డులోకి వెళ్లాలి. ప్రతి అక్కను, చెల్లెమ్మను, అవ్వను, ప్రతి తాతను కలవాలి. ప్రతి ఒక్కరికి చెప్పాలి. అక్కా..చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. రెండు రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయితే చాలు మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏడాదికి రూ.15 వేలు ఇస్తారని చెప్పండి. 
  •  అక్కా..ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు మన పిల్లలను డాక్టర్లు, ఇంజినీరింగ్‌ చదువులు చదివించే పరిస్థితిలో ఉన్నామా. ఫీజులు ఏడాదికి లక్ష రూపాయలు ఉన్నాయి. చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. ఇవి కూడా సకాలంలో ఇవ్వడం లేదు. ఈ రోజు అప్పులపాలు అయితే తప్ప మన పిల్లలను చదివించే స్థితిలో లేము. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. రెండు రోజులు ఓపిక పడితే..అన్న ముఖ్యమంత్రి అవుతారు. మన పిల్లలు ఏ చదువులు అయినా కూడా ఎన్ని లక్షలు ఖర్ఛైనా కూడా అన్న చదివిస్తారని చెప్పండి.
  •  పొదుపు సంఘాల్లో ఉన్న అక్కలు, చెల్లెమ్మలకు చెప్పండి. ఐదేళ్లలో చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయలేదు. కనీసం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. అక్కా..ఈ పెద్ద మనిషి మాఫీ చేయకపోగా, గత ప్రభుత్వాలు పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చేవి. చంద్రబాబు వచ్చాక సున్నా వడ్డీ రుణాలు రద్దు చేశారని చెప్పండి. రెండు రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల్లో ఉన్న అక్కలకు, చెల్లెమ్మలకు ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ రుణాలన్నీ నేరుగా నాలుగు దఫాల్లో మీకే ఇస్తారని చెప్పండి.
  •  సున్నా వడ్డీకే రుణాలు రావాలంటే రాజన్న బిడ్డ జగన్నతోనే సాధ్యమని ప్రతి ఒక్కరికి చెప్పండి.
  •  పేదరికంలో ఉండి అవస్థలు పడుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు చెప్పండి. అక్కా..చంద్రబాబు మోసాలకు మోసపోవద్దు. 45 ఏళ్లు నిండిన అక్కలకు రూ.75 వేలు ఉచితంగా ఇస్తారని చెప్పండి. 
  •  ప్రతి ఒక్కరికి చెప్పండి. చంద్రబాబు మోసాలకు మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. చంద్రబాబు చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా రాలేదని చెప్పండి. గత ప్రభుత్వాలు రైతులకు సున్నావడ్డీకే రుణాలు ఇచ్చేవి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారని చెప్పండి. రైతన్నలకు చెప్పండి..ఏ ఒక్క ఏడాదైనా పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చాయా అని చెప్పండి. రెండు రోజులు ఓపిక పడితే ..అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం..అన్న సీఎం అయ్యాక ప్రతి ఏటా రూ.12500 పెట్టుబడుల కోసం ఇస్తారని చెప్పండి, అక్షరాల రూ.50 వేలు ఇస్తారని చెప్పండి. సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో రాజన్న రాజ్యంలో చూశాం. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు రావాలంటే రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. అన్నా..రైతన్న జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ ఇస్తారని చెప్పండి,
  •  ప్రతి  అవ్వను, ప్రతి తాతను కలవండి. అవ్వా..ఇవాళ ఎన్నికలు వచ్చాయి. రెండు నెలల క్రితం వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు రూ.2 వేలు  ఇస్తున్నారు. అవ్వా..ఒక్కే ఒక్క మాట అడుగుతాను. ఎన్నికలు రాకపోయి ఉంటే..జగనన్న రూ.2 వేలు ఇస్తామంటే అప్పుడు చంద్రబాబు పింఛన్లు రెండు వేలు ఇస్తున్నారు. నీ మనువడు ముఖ్యమంత్రి అయితే పింఛన్‌ రూ.3 వేలకు పెంచుతూ పోతారని చెప్పండి.
  •  ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో గ్రామానికి 10 ఇళ్లు కూడా కట్టించలేకపోయారు. టౌన్‌లో ఇళ్లు కట్టిస్తే అధిక రేటుకు  ఇస్తున్నారు. పేదవారి పేరు మీద అక్షరాల రూ.3 లక్షలు అప్పుగా రాసుకుంటున్నారు. ఆ పేదవాడు 25 ఏళ్ల పాటు నెలకు రూ.3 వేలు కడుతూ పోవాలట. ప్రతి పేదవాడికి ఉచితంగా ఇల్లు ఇచ్చే రోజులు ఆ రాజన్న రాజ్యంలో చూశాం. మళ్లీ పేదవాడికి ఉచితంగా ఇళ్లు రావాలంటే జగనన్న రావాలి. 
  •  ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశాం. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. నెలకు రూ.2 వేలు ఇస్తామన్నారు. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న సీఎం అయ్యాక ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల 30 వేలు ఒకేసారి భర్తీ చేస్తారని చెప్పండి.  అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ సెక్రటేరియట్‌ తెరుస్తారు. ఆ గ్రామ సెక్రటేరియట్‌లో స్థానికుల్లో పది మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పండి. ఆ ప్రతి నిరుద్యోగికి చెప్పండి. అన్న పరిపాలనలో 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను ఏర్పాటు చేస్తారని చెప్పండి.
  •  మళ్లీ మంచి రోజులు రావాలంటే.. మళ్లీ ఆ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నకు అవకాశం ఇద్దామని ప్రతి నిరుద్యోగికి చెప్పండి. 
  •  ఇవాళ మీ అందరికి చెడిపోయిన వ్యవస్థ గురించి చెప్పా..నవరత్నాల గురించి కూడా చెప్పాను. మన మేనిఫెస్టోలో పాదయాత్ర పొడవునా నేను చూసిన ప్రతి కష్టాన్ని తీర్చేందుకు పథకాలు రూపొందించాను. ఎవరికి లంచాలు ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా మీ అందరికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటా.
  • ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఎన్నేన్ని కుట్రలు పన్నుతున్నారో మీ అందరికి తెలుసు. ఆ కుట్రల్లో భాగంగా చంద్రబాబు దుష్ప్రచారాలు చూస్తున్నాం. మైనారిటీలకు సంబంధించి మన పార్టీ పుట్టినప్పుటి నుంచి జగన్‌ అనే వ్యక్తి సింగిల్‌గానే వచ్చారు. జగన్‌ నమ్ముకున్నది దేవుడిని..ప్రజలే తప్ప మరెవరిని నమ్ముకోలేదు. గత ఎన్నికలకు ముందు మోడీ ప్రభంజనం దేశమంతా ఉందని తెలిసీ కూడా మనం ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. ఈ రోజు మన పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసీ నేను ఈ రోజు మోడీతో పొత్తు పెట్టుకుంటానా?. గతంలో మోడీకి ఉన్న గ్లామర్‌ ఈ రోజు లేదని తెలిసీ కూడా మోడీతో పొత్తు పెట్టుకుంటానా? మిమ్మల్ని అడుగుతున్నాను. మీ అందరికి ఒక్కటే చెబుతున్నాను. రాజకీయాలు చేసేసమయంలో నిజాయితీ ఉండాలి. మనసులో కల్ముషం ఉండకూడదు. 
  •  రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాక వలసలు వెళ్తున్నారు. పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వెళ్తున్నారు. ఈ పిల్లలకు మంచి జరగాలంటే రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో కేంద్రం మనకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ కేంద్రంలో పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎవరు ప్రధాని అవుతారో ఎవరికి తెలియదు. మోడీ కావొచ్చు..రాహూల్‌ కావచ్చు. మాకేమి అభ్యంతరం లేదు. ప్రత్యేక హోదాకు సంతకం పెట్టిన తరువాతే మీకు మద్దతిస్తామని చెబుతున్నాను. నేను ఈ అడుగులు వేయకపోతే ప్రత్యేక హోదా రాదు. హోదా వస్తేనే పరిశ్రమలు, ఆసుపత్రులు వస్తాయి. ప్రతి జిల్లా ఒక్క హైదరాబాద్‌ అవుతుంది. మోసం చేసే అలవాటు నాకు లేదు. ప్రతి మైనారిటీ సోదరుడికి ఇవాళ మాటిచ్చి చెబుతున్నాను. ఎవరైనా ప్రధాని కానివ్వండి..రాష్ట్రంలో మాత్రం మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని మరిచిపోవద్దు. ఎవరైనా కూడా మొట్టమొదట నాగుండానే పోవాలన్న సంగతి చెబుతున్నాను. ప్రత్యేక హోదా కోసం తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలని పేరు పేరున ప్రార్థిస్తున్నాను.
  •  చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. రాజకీయ నాయకుడు చేసిన వాగ్ధానం నెరవేర్చకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. నిజాయితీకి ఓటు వేయాలని కోరుతూ..కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్‌ నా తమ్ముడు..అన్ని రకాలుగా మంచి చేస్తారని నమ్ముతున్నాను. ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ను ఆశీర్వదించాలని వైయస్‌ జగన్‌ అభ్యర్థించారు. 
Back to Top