అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ చేసిన ట్వీట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ‘‘ హేమంత్ సోరేన్.. మీరంటే ఎంతో గౌరవముంది. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలుండొచ్చు కానీ... విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు దేశాన్ని బలహీనం చేస్తాయి. కరోనా వేళ రాజకీయాలొద్దు. కోవిడ్-19పై చేస్తోన్న యుద్ధంలో మనమంతా ఏకమవ్వాలి. ఈ సమయంలో ప్రధానిని నిందించే బదులు... పార్టీలకు అతీతంగా కోవిడ్‌పై పోరాటాన్ని బలోపేతం చేద్దా’’మని పేర్కొన్నారు. విజనరీ సీఎం వైయస్ జగన్: శతృఘ్నసిన్హా అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా ప్రశంసించారు. సీఎం వైయస్ జగన్‌ను ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారు కూడా దీనిని అమలు చేయాలంటూ ట్వీట్ చేశారు. సీఎం వైయస్ జగన్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రంలో కరోనా చికిత్సను ఉచితంగా అందిస్తున్నారని, ఇది సరైన సమయంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని ఆయన అభివర్ణించారు. నిజంగా ఇది అవసరమైన వారికి ఎంతో ఉపయోగపడే నిర్ణయమన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఇతరులు కూడా ఏపీ సీఎం వైయస్ జగన్ బాటను అనుసరిస్తారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.