ముద్రగడ ఆరోగ్య పరిస్ధితిపై వైయస్‌ జగన్ ఆరా

ముద్ర‌గ‌డ గిరిబాబుకు మాజీ సీఎం ఫోన్‌

తాడేప‌ల్లి:  కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబుతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. అత్యవసరం అయితే కాకినాడ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ లిఫ్ట్ చేయాలని వైయస్‌ జగన్‌ సూచించారు. ఎయిర్ లిఫ్ట్‌కు సహకారం అందిస్తామని హమీ ఇచ్చారు. ఆయన్ని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు చిర్ల జగ్గిరెడ్డి, వంగా గీతా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు.

ముద్రగడ పద్మనాభం కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన శనివారం శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురి కావడంతో కాకినాడ అహోబిలం ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించారు. శనివారం రాత్రి 10.30 గంటల సమ­యంలో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను స్థానిక మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికి­త్స అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం ప్రస్తు­తం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Back to Top