వికలాంగుడి పట్ల సీఎం వైయస్‌ జగన్‌ ఉదారత

సచివాలయం: వికలాంగుడి పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉదారత చూపారు. రెండు కాళ్లు, చేతులు లేని వికలాంగుడికి ఆర్థికసాయం సీఎం వైయస్‌ జగన్ రూ.5 లక్షలు మంజూరు చేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేతుల మీదుగా అందజేశారు. సీఎం వైయస్‌ జగన్‌ పేదలకు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నారని నారాయణ స్వామి పేర్కొన్నారు. లక్ష రూపాయల సాయం అడిగితే రూ.5 లక్షలు ఇవ్వడం చాలా సంతోషమన్నారు. గొప్ప మానవతావాది ముఖ్యమంత్రిగా లభించడం పేదల అదృష్టమని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. 

Read Also:  ఇస్త్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు

Back to Top