తాడేపల్లి: ఉపాధ్యాయులందరికీ వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాంకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు’అని వైయస్ జగన్ పేర్కొన్నారు.