స‌చివాల‌య వ్య‌వ‌స్థ దేశానికే ఆద‌ర్శం

ముంబైలో జరిగిన సదస్సులో అనంతపురం మేయర్ వసీం 

అనంత‌పురం: ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  హయాంలో తీసుకొని వచ్చిన సచివాలయం వ్యవస్థ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని అనంతపురం మేయర్ వసీం సలీం పేర్కొన్నారు.  నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడంలో  సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకంగా ఉంటుందని నొక్కి వక్కాణించారు.  ముంబైలోని  జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో పట్టణ జీవనాన్ని మెరుగుపరచడంలో సాంకేతిక పాత్ర అనే అంశంపై సదస్సు ను  ఇన్ఫో కాం ఇండియా మరియు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్  లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో  నిర్వహించిన సదస్సులో అనంతపురం మేయర్ వసీం పాల్గొని ప్రసంగించారు. " స్మార్ట్ సిటీస్- పట్టణాల్లో జీవన ప్రమాణాలు మెరుగు" అనే అంశాల మీద ఒక ప్యానెల్ లో ఆయన వక్తగా పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి హయాంలో తీసుకొని వచ్చిన సచివాలయం వ్యవస్థ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా  అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సచివాలయం వ్యవస్థ ద్వారానే సేవలు అందిస్తుందని గుర్తు చేశారు. సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సాంకేతిక విజ్ఞానంతో ప్రజలకు సేవలు అందించే అవకాశం కల్పించారన్నారు.

మొబైల్ యాప్స్ ను ఉపయోగించి అర్హులే ప్రామాణికంగా ఎంపిక చేసి డిబిటి విధానంలో వారికి నేరుగా వారి ఖాతాలోనే జమ అయ్యే విధానాన్ని  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు  ప్రజలకు చేరువ చేశారన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలల్లో  పలు అధునాతన సౌకర్యాలను కల్పించడంతోపాటు ఎల్ఈడి ప్యానల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు విజ్ఞానం పెంపొందించుకోవడానికి అవకాశం కల్పించారన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తేనే ప్రజలకు సేవలు సకాలంలో అందివ్వడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. నగరాలు పట్టణాలు రోజు రోజుకి అభివృద్ధి చెందడం వల్ల జనాభాకు అనుగుణంగా వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం  ఎంతో అవసరం ఉందన్నారు.  

 అనంతపురం నగరంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేపట్టిన కార్యక్రమాలను మేయర్ వసీం తెలియజేశారు.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రొఫెషనల్స్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం  ఇచ్చారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నగరాల గురించి ఆయా ప్రాంతాల  ప్రతినిధులు వివరిస్తే  అనంతపురం మేయర్ గా అనంతపురం నగరం గురించి  తెలియజేసే అవకాశం  మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి నాయకత్వం, అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి  సహకారం, అనంతపురం నగరంలోని ప్రజలు మద్దతుతో   నాకు  దక్కిందన్నారు.  ఆయన నగరాల్లో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు అనంతపురం నగరంలో కూడా కొన్నింటిని అమలు చేయడానికి ఈ సదస్సు వల్ల సరికొత్త విషయాలు తెలిసి వచ్చాయన్నారు.

 

Back to Top