నేడు వైయ‌స్ జ‌గ‌న్ కీలక ప్రెస్‌మీట్ 

 తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇవాళ‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఈ మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వేల కోట్ల రూపాయిల విలువైన భూములను బినామీలకు ఎలా దోచిపెట్టారు.. అనే అంశాలపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోడం, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగినంత సమయం కేటాయించకపోవడంతో ఆయన మీడియా సాక్షిగానే చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సంగతి తెలిసిందే.

Back to Top