టీడీపీ దాడులపై వైయస్‌ఆర్‌ సీపీ నిర్థారణ కమిటీ

టీడీపీ దాడులు, దౌర్జన్యాలపై నిజ నిర్థారణ కమిటీ  

 

హైదరాబాద్‌ : గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్‌ (ఏప్రిల్‌ 11) రోజున, పోలింగ్‌ తర్వాత టీడీపీ శ్రేణులు పాల్పడిన దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిజనిర్ధారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యులు పై మూడు నియోజక వర్గాలలో పర్యటించి.. ఆయా గ్రామాల్లో   కోడెల శివప్రసాద్, ఆయన అనుచరులు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులపై వాస్తవాలు తెలుసుకోవడంతోపాటు, ఈ దాడుల్లో గాయపడిన, నష్టపోయిన వారికి పార్టీ అండగా నిలుస్తోందని భరోసా ఇస్తారు.

టీడీపీ దౌర్జన్యకాండకు సంబంధించి ఈ కమిటీ బాధితులను నేరుగా కలిసి వాస్తవాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత సమగ్ర నివేదికను జగన్‌ మోహన్‌ రెడ్డికి సమర్పిస్తారు. మర్రి రాజశేఖర్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో సభ్యులుగా లావు శ్రీకృష్ణదేవరాయలు, అంబటి రాంబాబు,  కాసు మహేశ్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జంగా కష్ణమూర్తి, మహమ్మద్‌ ఇక్బాల్‌ ,అంజాద్‌ బాషా, నవాజ్‌ సభ్యులుగా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

 

Back to Top