తాడేపల్లి: వినాయకచవితి సందర్బంగా రాష్ట్ర ప్రజలకు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.