తాడేపల్లి: నూతన సంవత్సరం 2026 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2026వ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలని, అందరికీ ఆరోగ్యం అందించాలని.. ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని శ్రీ వైయస్ జగన్ అభిలషించారు.