దృఢ సంక‌ల్పానికి ఏ వైక‌ల్యం అడ్డుకాదు

ప్ర‌పంచ దివ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ఆత్మ విశ్వాసానికి, దృఢ సంక‌ల్పానికి ఏ వైక‌ల్యం అడ్డుకాద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ‌ ప్ర‌పంచ దివ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా  విభిన్న ప్రతిభావంతులందరికీ ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా..
ఆత్మ విశ్వాసానికి, దృఢ సంక‌ల్పానికి ఏ వైక‌ల్యం అడ్డుకాదు. ప‌ట్టుద‌ల‌తో స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తూ, ప్ర‌తి రంగంలోనూ నూత‌న శిఖ‌రాల‌ను అధిరోహిస్తున్న విభిన్న ప్రతిభావంతులందరికీ  ప్ర‌పంచ దివ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

Back to Top