గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతుపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతు వార్తపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తక్షణమే పంపి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు.

Back to Top